Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బు కోసం బాయ్‌ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేసిన ప్రియురాలు

ఠాగూర్
బుధవారం, 30 జులై 2025 (09:18 IST)
డబ్బు కోసం బాయ్‌ఫ్రెండ్‌ను ఓ యువతి ప్రియురాలు కిడ్నాప్ చేశారు. దుబాయ్ ట్రావెల్ సంస్థకు మేనేజరుగా పని చేస్తున్న లారెన్స్ మెల్విన్ ఇటీవల తన స్వస్థలమైన బెంగుళూరుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో జూలై 16వ తేదీ నుంచి లారెన్స్ కనిపించట్లేదని తల్లి బెంగుళూరులోని అశోక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని కిడ్నాప్ చేసినట్టు ఫోను చేసిన దండగులు రూ.2.5 కోట్లు ఇవ్వాలని బెదిరించినట్టు పేరొన్నారు. 
 
కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు లారెన్స్ అపహరణకు స్వయానా అతడి గర్ల్ ఫ్రెండ్ మహిమా పథక రచన చేసినట్లు గుర్తించారు. జులై 14న బయటకు వెళ్లామని మహిమా చెప్పడంతో లారెన్స్ ఓ కారు బుక్ చేసుకొని ఆమెతోపాటు వెళ్లారు. కొంతదూరం వెళ్లాక డ్రైవరు కారును దారి మళ్లించాడు. ఓచోట మరో ఇద్దరు వ్యక్తులు కారెక్కి లారెన్స్‌పై దాడి చేశారు. అతడి వద్ద ఉన్న రూ.లక్ష లాక్కొని ఓ అపార్టుమెంటులో బంధించారు. 
 
దాదాపు ఎనిమిది రోజులు చిత్రహింసలకు గురిచేసి.. లారెన్స్ కుటుంబానికి ఫోను చేసి రూ.2.5 కోట్లు డిమాండ్ చేశారు. అదే అపార్టుమెంట్‌లో ఉంటున్న ఓ మహిళ ఇచ్చిన సమాచారంతో పోలీసులు లారెన్సు‌ను రక్షించి, నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన కుట్రదారు మహిమా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments