Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేడ్చల్‌లో బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (17:12 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఓ మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. తన స్నేహితులతో కలిసి పాఠశాల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ఆటో డ్రైవర్ మాయమాటలు చెప్పి ఆటో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ ఘటన రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలో జరిగింది. గత నెల 31వ తేదీన 15 యేళ్ల బాలిక తన స్నేహితులతో స్కూలు నుంచి ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యంలో బాలికకు పరిచయం ఉన్న ఆటో డ్రైవర్ (50) వచ్చి మాయమాటలు చెప్పి ఆ బాలికను ఆటో ఎక్కించుకుని వెళ్లిపోయాడు. 
 
ఆ మరుసటి రోజు ఈ విషయాన్ని బాలిక స్నేహితులు క్లాస్ టీచర్‌కు చెప్పారు. ఆ తర్వాత ఆ బాలికను పిలిచి విచారించగా, ఆటో డ్రైవర్ అత్యాచారం చేసినట్టు బోరున విలపిస్తూ చెప్పింది. ఆ తర్వాత టీచర్ బాలిక తల్లిదండ్రులకు ఫోను చేసి విషయం చెప్పింది. 
 
అయితే, తమ పరువు పోతుందని భావించిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీంతో ఈ నెల 4వ తేదీన టీచర్ బాధిత బాలికతో పోలీసులకు ఫిర్యాదు చేయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆటో డ్రైవర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments