Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పూణేలో బాలుడుపై లైంగికదాడి.. ఆపై దారుణ హత్య

Advertiesment
పూణేలో బాలుడుపై లైంగికదాడి.. ఆపై దారుణ హత్య
, ఆదివారం, 27 మార్చి 2022 (15:57 IST)
మహారాష్ట్రలోని పూణేలో ఓ బాలుడిపై లైంగికదాడి జరిగింది. ఆ తర్వాత దారుణంగా హత్య చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పూణేకు సమీపంలో మహబూబ్ నగర్ జిల్లా గున్నెడ మండలం పీర్లబండ తండాకు చెందిన ఓ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిలో రెండో కుమారుడు కరణ్ (13). మూగ బాలుడు. తల్లిదండ్రులతో కలిసివుంటున్నారు. ఈ దంపతులు పూణేకు వలస వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. 
 
తల్లిదండ్రులు పనులకు వెళితే బాలుడు మాత్రమే ఇంట్లో వుండేవాడు. ఈ క్రమంలో గురువారం కూడా తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లగా బాలుడు మాత్రమే ఇంట్లో ఉన్నాడు. సాయంత్రం 4 గంటల సమయంలో ఇంటి పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పుంటి అనే వ్యక్తి మరో వ్యక్తితో కలిసి బైక్‌పై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి లైంగికదాడికి పాల్పడ్డారు. 
 
ఈ క్రమంలో బాలుడి చేయి విరిగింది. ఆ తర్వాత హత్య చేశారు. మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి చెత్త డబ్బాలో వేయడాన్ని సెక్యూరిటీ గార్డు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంతలో తమ కుమారుడు కనిపించలేదంటూ బాలుడు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేపు - ఎల్లుండి భారత్ బంద్ - కార్మిక సంఘాల మద్దతు