Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేసిన వ్యక్తిని గదిలో బంధించిన ఎయిర్‌హోస్టెస్!

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (14:05 IST)
తనపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడిని బాధితురాలు గదిలో బంధించింది. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి పట్టించింది. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. బాధితురాలి వయసు 30 యేళ్లు. ఈమెకు ఆ కామాంధుడికి నెలన్నర క్రితం పరిచయమైంది. అంతలోనే ఆ వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. 
 
30 యేళ్ళ ఎయిర్‌హోస్టెస్ ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో పని చేస్తున్నారు. ఈమెకు హర్జీత్ యాదవ్ అనే వ్యక్తి నెలన్నర క్రితం పరిచయమయ్యాడు. ఈ క్రమంలో బాధితురాలి ఇంటికే వెళ్లిన హర్జీత్ యాదవ్ లైంగిక దాడికి తెగబడ్డాడు. కాన్పూర్‌కు చెందిన ఈ వ్యక్తి ఒక రాజకీయ పార్టీకి బ్లాక్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. 
 
అయితే అత్యాచారానికి గురైన తర్వాత కూడా ఆమె ఏ మాత్రం ధైర్యాన్ని కోల్పోకుండా... ఆతన్ని గదిలో బంధించి పోలీసులకు ఫోన్ చేసింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు హర్జీత్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. ఆయనపై సెక్షన్ 376 (అత్యాచారం), 323 (ఒక వ్యక్తిని హింసించడం), 509 (మహిళ గౌరవాన్ని నాశనం చేయడం), 377 (ప్రకృతి విరుద్ధమైన చర్యలకు పాల్పడటం) కింద కేసులు నమోదు చేశారు. 
 
ఈ సందర్భంగా డిప్యూటీ పోలీస్ కమిషనర్ చందన్ చౌదరి మాట్లాడుతూ 30 ఏళ్ల బాధితురాలు ఎయిర్ హోస్టెస్‌గా పని చేస్తుందని, హర్జీత్ యాదవ్ ఆమెకు నెలన్నర క్రితం పరిచయమయ్యాడని తెలిపారు. మద్యం మత్తులో బాధితురాలి ఇంటికి వచ్చి ఆమెపై అత్యాచారం చేశాడని చెప్పారు. అతన్ని గదిలో బంధించి 112 నంబరుకు ఫోన్ చేసి సమాచారం చేరవేసిందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం