Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి బయట ఆడుకుంటున్న బాలిక మెడ పట్టుకున్న వీధి కుక్క

Webdunia
శుక్రవారం, 29 అక్టోబరు 2021 (22:21 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లాంలో కుక్కల బెడద పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పిల్లలు, పెద్దలు అందరిపైనా కుక్కలు దాడి చేస్తున్నాయి. అశోక్ నగర్‌లో గురువారం నాలుగేళ్ల బాలికపై కుక్క దాడి చేసింది. కొంత దూరం పాటు ఈడ్చుకుని వెళ్లింది. దీనితో బయట కూర్చున్న ఇరుగుపొరుగు కుక్కను గట్టిగా కేకలు వేయడంతో పారిపోయింది.

 
అప్పటికే ఆ కుక్క ఆ బాలిక గొంతుపై కొరకడంతో ఆమెకు గాయాలయ్యాయి. అశోక్‌నగర్ ప్రాంతంలోని గ్రీన్ సిటీలో నాలుగేళ్ల ఉమేరా కుమార్తె ఇమ్రాన్ గురువారం మధ్యాహ్నం ఇంటి బయట ఆడుకుంటున్నది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఓ కుక్క వచ్చి ఉమేరా మెడను పట్టుకుంది. ఉమేరా గట్టిగా కేకలు వేయడంతో రోడ్డుపై కొంతదూరంలో కుర్చీలో కూర్చున్న ఇరుగుపొరుగు వారు కుక్కను తరిమేశారు.

 
నగరంలో కుక్కల బెడదను తగ్గించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ స్టెరిలైజేషన్ కేంద్రాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టులో కొన్ని కుక్కలను పట్టుకుని స్టెరిలైజేషన్ చేయిస్తున్నా ఫలితం కనిపించడం లేదు.

 
మున్సిపల్ కార్యాలయం, గులాబ్ చక్కర్, 80 అడుగుల రోడ్డు, కస్తూర్బా నగర్, అశోక్ నగర్, కర్మాది రోడ్డు తదితర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కుక్కల మందలు సంచరిస్తున్నాయి. ఉదయం పాఠశాలకు వెళ్లే పిల్లలు, వాకింగ్‌కు వెళ్లే వృద్ధులు, రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చేవారు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఇంటికి వస్తున్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా వున్నా కుక్కలు దాడి చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments