మరికొన్ని గంటల్లో ముహూర్తం.. పెళ్లి మండపంలో వరుడు మృతి!

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (09:04 IST)
మరికొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సిన వరుడు గుండెపోటుతో పెళ్లి మండపంలోనే కన్నుమూశారు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉట్నూరు పట్టణంలోని రావుల శంకరయ్య - భూలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు రావుల సత్యనారాయణ చారి (34) అనే వ్యక్తిగి జగిత్యాలజిల్లా మెట్‌పల్లికి చెందిన ఓ యువతితో గురువారం ఉదయం వివాహం జరగాల్సివుంది. బుధవారం అర్థరాత్రి వరకు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సరదాగా గడిపిన వరుడు.. ఉన్నట్టుండి ఒక్కసారిగా కప్పకూలిపోయాడు. 
 
దీన్ని గమనించిన స్నేహితులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. పెళ్లి బాజాలు మోగాల్చిన ఇంటిలో చావుడప్పాలు మోగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments