Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆటో డ్రైవర్‌తో అక్రమ సంబంధం... ఏకాంతానికి అడ్డుగా ఉన్నారనీ...

Advertiesment
woman
, మంగళవారం, 24 జనవరి 2023 (08:50 IST)
ఓ మహిళకు ఆటో డ్రైవర్‌తో అక్రమ సంబంధం ఏర్పడింది. అతనితో ఏకాంతంగా ఉండేందుకు పిల్లలు అడ్డుగా ఉన్నారని భావించి, అర్థరాత్రి నడిరోడ్డుపై వదిలిపెట్టి పారిపోయింది. ఈ హృదయ విదారక ఘటన తెలంగాణ రాష్ట్రంలోని యాదగిరి భువనగిరి జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్‌లోని భగత్ సింగ్ నగర్‌కు చెందిన బాబూరావు, లక్ష్మీ అనే దంపతులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ ఆది నుంచి కలహాల కాపురం చేస్తున్నారు. ఈ క్రమంలో వీరికి 10, 5, 2 యేళ్ల కుమారులతో పాటు ఎనిమిదేళ్ల కుమార్తె ఉన్నారు. భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా మూడేళ్ల క్రితం భర్త చెప్పాపెట్టకుండా ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. 
 
ఆ తర్వాత లక్ష్మికి అదే ప్రాంతంలో ఉండే ఓ ఆటో డ్రైవర్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. వారిద్దరూ ఏకాంతంగా ఉండేందుకు పిల్లలు అడ్డుగా మారారు. దీంతో వారిని వదిలించుకోవాలని లక్ష్మీ, ఆటో డ్రైవర్ ప్లాన్ వేశారు. నలుగుర పిల్లలతో కలిసి ఆటోలో ఈ నెల 14వ తేదీన అర్థరాత్రి యాదాద్రికి చేరుకున్నారు. అక్కడ రెండేళ్ల కుమారుడిని తన వద్దే ఉంచుకుని మిగితా పిల్లలను అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోయారు. 
 
కొండకింద అక్కడే ముగ్గురు పిల్లలు చలికి వణుకూ తెల్లవారేదాకా ఉన్నారు. ఎంతకీ తమ తల్లి రాకపోవడంతో ఆలయానికి వచ్చిన భక్తుల వద్ద భిక్షమెత్తుకుని ఆకలిబాధ తీర్చుకున్నాడు. ఆ సమయంలో పాశం కోటి అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ వారిని గుర్తించి యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారు జిల్లా బాలల పరిరరక్షణ కేంద్రంలో చేర్పించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విమానంలో అలా జరిగింది.. వీడియో వైరల్