Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెతో వివాహితుడి ప్రేమ.. సుత్తితో కొట్టి చంపేసిన తండ్రి.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (11:41 IST)
ఏపీలోని గుంటూరు జిల్లాలో ఓ వివాహేతర హత్య జరిగింది. తన ముక్కుపచ్చలారని కన్నబిడ్డతతో ఓ వివాహితుడు ప్రేమ పేరుతో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని కన్నతండ్రి జీర్ణించుకోలేక పోయాడు. దీంతో ఆ వ్యక్తిని చంపేందుకు ప్లాన్ చేశారు. ఒంటరిగా చిక్కిన ఆ వివాహితుడి కళ్ళలో కారం చల్లి.. తలపై సుత్తితో కొట్టి చంపేశాడు. ఈ దారుణ ఘటన గుంటూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని ఫిరంగిపురం మండలం 113 తాళ్లూరుకు చెందిన శ్రీనివాసరెడ్డి, పల్నాడు జిల్లా నరసరావుపేటలో రీజినల్‌ సేఫ్టీ డ్రైవింగ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. తన కూతురును ఫార్మాసీ కోర్సు చదివించాడు. ఆమె గుంటూరువారితోటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్‌గా పనిచేస్తున్నారు.
 
ఇదే ఆస్పత్రిలో ఫిజియోథెరఫీ వైద్యుడిగా పనిచేస్తున్న పల్నాడు జిల్లా బెల్లంకొండకు చెందిన సత్తెనపల్లి సీతారామాంజనేయులు ఆమెకు పరిచయమయ్యాడు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అప్పటికే అతడికి తన బంధువుల అమ్మాయితో పెళ్లయింది. భార్యతో మనస్పర్థలు తలెత్తడంతో విడిగా ఉంటున్నారు. 
 
ఈ ప్రేమ విషయం తెలిసిన తండ్రి శ్రీనివాస రెడ్డి జీర్ణించుకోలేక పోయాడు. తన కుమార్తెను ఉన్నత చదువుల కోసం ఏడాది క్రితం అమెరికాకు పంపించాడు. రెండేళ్ల కోర్సు చదవాల్సి ఉండగా, పూర్తి కాకుండానే ఆమె గుంటూరుకు రావడానికి సిద్ధమైంది. ఇప్పుడే వద్దు డిసెంబరులో రమ్మని తండ్రి శ్రీనివాస రెడ్డి ఎంత చెప్పినా వినిపించుకోలేదు. సీతారామాంజనేయులు ఏం చెబితే అది చేస్తానంది.
 
తన కూతురు భవిష్యత్తును వివాహితుడైన సీతారామాంజనేయులు నాశనం చేస్తున్నాడని, ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకోవాలని శ్రీనివాస రెడ్డి పథకం పన్నాడు. ఒక సంచిలో ఇనుప సుత్తి, కారంపొడి పెట్టుకొని గత నెల 29వ తేదీ రాత్రి గుంటూరువారితోటలోని సీతారామాంజనేయులు ఇంటికి వెళ్లాడు. తన కుమార్తెను విదేశాల నుంచి ఇప్పుడు రావద్దని చెప్పమని కోరాడు.
 
అందుకు వైద్యుడు నిరాకరించడంతో ఆగ్రహించిన శ్రీనివాసరెడ్డి సంచిలో ఉన్న కారంపొడిని సీతారామాంజనేయులు కంట్లో చల్లి, ఇనుప సుత్తితో తలపై బలంగా కొట్టి చంపాడు. ఈక్రమంలో రక్తం చింది చొక్కాపై పడింది. ఘటనా స్థలిలోనే మరో చొక్కాను మార్చుకున్నాడు. పోలీసు జాగిలాలు పసికట్టకుండా మిగిలిన కారం పొడిని ఆ ప్రాంతంలో చల్లాడు. రక్తంతో తడిసిన చొక్కా, ఇనుప సుత్తిని ఒక కవరులో వేసుకొని, ఫిరంగిపురం మండలం సిరిపురంలోని 30 అడుగుల లోతు ఉన్న బావిలో సుత్తి, చొక్కా పడేసి జడ్చర్ల వెళ్లాడు. 
 
ఈ కేసు నమోదు చేసిన కొత్తపేట సీఐ అన్వర్‌ బాషా దర్యాప్తు చేపట్టారు. నిఘా నేత్రాల్లోని ఫుటేజీతో పాటు ఘటనా స్థలిలో లభించిన ఆధారాలతో శ్రీనివాసరెడ్డి నిందితుడని నిర్ధారించుకున్నారు. ఏఎస్పీ నచికేట్‌ షల్కే పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. బుధవారం మధ్యాహ్నం నిందితుడు 113 తాళ్లూరులోని తన ఇంటికి వెళుతుండగా అక్కడ పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్షమించమని అడక్కుండా రాజకీయాలకు స్వస్తి చెప్తే సరిపోదు: పోసానిపై నిర్మాత

అతివృష్టి లేదంటే అనావృష్టి : ఈ శుక్రవారం ఏకంగా 10 చిత్రాలు విడుదల...

పుష్ప-2 ది రూల్‌ నుంచి శ్రీలీల కిస్సిక్‌ సాంగ్‌ రాబోతుంది

డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ కిల్లర్ నుంచి పూర్వాజ్ క్యారెక్టర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments