Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ ఫలితాన్ని మరోమారు సమీక్షించాలి : గ్యారీ స్టీడ్

Webdunia
మంగళవారం, 16 జులై 2019 (16:50 IST)
ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోటీలు జరిగాయి. గత ఆదివారం నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఫైనల్ పోరుతో ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది. రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టు పోరాడి ఓడినప్పటికీ కోట్లాది మంది క్రికెట్ అభిమానుల మనసులను గెలుచుకుంది. 
 
అయితే, ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించిన విధానంపైనే ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఇప్పటివరకు ఎవరికీ తెలియని బౌండరీ నిబంధన ఒకటి తెరపైకి వచ్చింది. ఇలాంటి నిబంధన ఒకటి ఉందని తెలిసి సగటు క్రికెట్ అభిమాని నివ్వెరపోతున్నారు. దీంతో బౌండరీ నిబంధన ఇపుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పైగా, ఓడిన న్యూజిలాండ్ జట్టుపై సానుభూతి వ్యక్తమవుతోంది. 
 
ఈ ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించిన విధానంపై న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టీడ్ స్పందించారు. వరల్డ్ కప్ ఫైనల్ డ్రాగా ముగిసిందని.. అందువల్ల వరల్డ్ కప్‌ను ఇరు జట్లు షేర్ చేసుకుని.. రెండు జట్లను విజేతలుగా ప్రకటించి ఉంటే బాగుండేదన్నారు. ప్రకటించిన ఫలితాన్ని ఐసీసీ మరోసారి సమీక్షించుకోవాలని ఆయన సూచించారు. రెండు జట్లు నిర్ణీత ఓవర్లలో సమాన పరుగులు చేసినా ఇంగ్లండ్‌నే విజేతగా ప్రకటించడంతో ఏదో వెలితిగా ఉన్న భావన కలిగిందని గ్యారీ చెప్పారు.
 
గుప్తిల్ వికెట్లకు విసిరిన బంతి బెన్‌స్టోక్స్ బ్యాట్‌కు తాకి బౌండ్రీ లైన్‌కు వెళ్లడం, అంపైర్ ఆరు పరుగులు ప్రకటించడం తెలిసిందే. అయితే.. రూల్స్ ప్రకారం ఐదు పరుగులు మాత్రమే ప్రకటించాల్సి ఉంది. ఈ విషయంలో అంపైర్ తప్పిదం స్పష్టంగా కనిపించిందని క్రికెట్‌లో ప్రపంచ దిగ్గజ అంపైర్‌గా పేరొందిన టోఫెల్ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. 
 
ఈ విషయంపై న్యూజిలాండ్ కోచ్ స్టీడ్ స్పందిస్తూ తనకు ఆ రూల్ గురించి తెలియదని చెప్పారు. అంపైర్లు కూడా మనుషులేనని, కొన్ని సందర్భాల్లో మానవ తప్పిదాలు సహజమేనని స్టీడ్ తెలిపారు. ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా దేన్నీ మార్చలేమని కివీస్ కోచ్ స్టీడ్ నిస్సహాయత వ్యక్తం చేశాడు. మొత్తంమీద ఈ 12వ ప్రపంచ కప్ పోటీలు మాత్రం సరికొత్త చర్చకు దారితీశాయని చెప్పొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లాడుతానని తరచూ నాపై అత్యాచారం చేసాడు: కన్నడ నటుడు మనుపై సహ నటి ఫిర్యాదు

మీ పోస్టుల్లో ఎలాంటి భాష వాడారో మాకు అర్థం కాదనుకుంటున్నారా? సజ్జలపై సుప్రీం ఫైర్

Peddireddy Ramachandra Reddy: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

పాక్ ఆర్మీ చీఫ్‌కు ఫీల్డ్ మార్షల్ హోదా కాదు.. రాజు బిరుదు ఇవ్వాల్సింది : ఇమ్రాన్ ఖాన్

Heavy rain alert: అల్పపీడనం శక్తి తుఫాన్‌గా మారింది.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

తర్వాతి కథనం
Show comments