Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యర్థి జట్టుకు ఫీల్డింగ్ చేసిన ధోనీ.. వైరల్ అవుతున్న వీడియో

Webdunia
శుక్రవారం, 31 మే 2019 (16:49 IST)
బంగ్లాదేశ్‌ జట్టుకు వార్మప్ మ్యాచ్‌లో భారత క్రికెటర్లు ధోనీ, రాహుల్ సెంచరీ కొట్టారు. అలాగే ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ప్రత్యర్థి జట్టుకు కూడా బౌలింగ్ చేశాడు. ఇంకా ధోనీ ప్రత్యర్థి జట్టుకు ఫీల్డింగ్ సెట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
 
ఇకపోతే.. బంగ్లాదేశ్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 99 బంతుల్లో 108 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, నాలుగు సిక్సులు వున్నాయి. ధోనీ 78 బంతుల్లో 8 ఫోర్లు, ఏడు సిక్సులతో 113 పరుగులు సాధించాడు. ధోని ఇన్నింగ్స్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. 
 
మరోవైపు ధోనీ ప్రత్యర్థి జట్టుకు ఫీల్డింగ్ సెట్ చేయడం కూడా వివాదాస్పదమైంది. ఇక ధోని బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు 40వ ఓవర్‌ను పార్ట్ టైమ్ స్పిన్నర్ షబ్బీర్ రెహ్మాన్ వేశాడు. అయితే బౌలర్ కోసం ధోనినే ఫీల్డింగ్ పెట్టడం విశేషం.
 
షబ్బీర్ బౌలింగ్ వేస్తున్నప్పుడు ధోని స్ట్రైక్‌లో ఉన్నాడు. ఒక ఫీల్డర్ మాత్రం కదులుతూనే ఉన్నాడు. సాధారణంగా ఆ ఫీల్డర్ షార్ట్ స్క్వేరిష్ ఫైన్ లెగ్ రీజన్‌లో ఉండాలి. కానీ అతడు వేరే ప్లేస్‌లో ఉన్నాడు.

దీన్ని గమనించిన ధోని బౌలింగ్ వేయడాన్ని ఆపి.. ఫీల్డర్‌ను పొజిషన్‌లోకి వెళ్ళమని చెప్పు అని బౌలర్‌కు సూచించాడు. తన తప్పును తెలుసుకున్న బౌలర్ ఫీల్డర్‌ను అక్కడికి పంపించాడు.

నాన్ స్ట్రైకర్‌లో ఉన్న రాహుల్, అంపైర్, కామెంట్రేటర్లు అందరూ నవ్వుకున్నారు. ఈ ఘటన జరిగి రెండు రోజులైనా.. వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం కేసీఆర్

సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని

అనకాపల్లిలో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్న ప్రధాని

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments