ఐసీసీ టెస్ట్ ఛాంపియన్... పాయింట్ల పట్టికలో భారత్ స్థానమేంటి?

Webdunia
సోమవారం, 2 మార్చి 2020 (17:02 IST)
ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ టోర్నీలో భాగంగా భారత్ తొలిసారి టెస్ట్ సిరీస్ ఓటమిని చవిచూసింది. పైగా, గత దశాబ్దకాలంలో టెస్ట్ సిరీస్‌లో వైట్ వాష్ కావడం ఇదే తొలిసారి. ఇలాంటి చెత్త రికార్డు గతంలో నమోదు కాలేదు. మరోవైపు, ఈ వైట్ వాష్ తర్వాత ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు పాయింట్ల పట్టికలో ఏకంగా మూడో స్థానానికి ఎకబాకింది. కివీస్ ఖాతాలో 180 పాయింట్లు చేరాయి. అలాగే, భారత్ మాత్రం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో 360 పాయింట్లు ఉండగా, రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 64 పాయింట్లు భారత్ కంటే తక్కువగా ఉన్నాయి. 
 
కాగా, న్యూజిలాండ్ జట్టు 60 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండేది. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో 80 పాయింట్లను రాబట్టుకుంది. ఇపుడు భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ ద్వారా 60 పాయింట్లను సంపాదించుకోవడంతో కివీస్ ఖాతాలో 180 పాయింట్లు చేరాయి. ఫలితంగా ఏకంగా మూడు స్థానాలు ఎగబాకింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఆర్టీసీ బస్సులు కొనుగోలు : బ్రహ్మానంద రెడ్డి

రాహుల్ జీ... దయచేసి త్వరగా పెళ్లి చేసుకోండి...

ఢిల్లీ ప్రజలకు ఊపిరాడటం లేదు.. ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం

యూపీలో దారుణం : దళితుడిపై అగ్రవర్ణాల దాష్టీకం.. బూట్లు నాకించి.. చేయి విరగ్గొట్టారు

తెలంగాణాలో నాలుగు రోజుల పాటు వర్షాలే వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas : ప్రభాస్ పుట్టినరోజున చిత్రం గా పద్మవ్యూహాన్ని జయించిన పార్ధుడు పోస్టర్ రిలీజ్

Shobhita : ప్రేమ, వెలుగు కలిసి ఉండటం అంటే దీపావళే అంటున్న చైతు, శోభిత

Manchu Manoj : గాంధీకి, బ్రిటీష్ వారికి సవాల్ గా మారిన డేవిడ్ రెడ్డి గా మంచు మనోజ్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

Atlee: శ్రీలీల, బాబీ డియోల్ కాంబినేషన్ లో అట్లీ - రాణ్వీర్ సింగ్ చిత్రం

తర్వాతి కథనం
Show comments