Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమికుడిని చూసి పెళ్లి పీటలు నుంచి పరుగులు తీసి కౌగిలించుకున్న వధువు, ఎక్కడ?

Advertiesment
ప్రేమికుడిని చూసి పెళ్లి పీటలు నుంచి పరుగులు తీసి కౌగిలించుకున్న వధువు, ఎక్కడ?
, శనివారం, 29 ఫిబ్రవరి 2020 (18:56 IST)
పెళ్లి పీటలెక్కిన వధువు ఆపండి అంటూ పెద్దగా కేక వేసి పక్కకు తప్పుకుంది. దీంతో పెళ్లికొచ్చిన అతిథులు, ఇరు కుటుంబాల పెద్దలు షాకయ్యారు. ఈ ఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని ఒక గ్రామంలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన వధువు కుటుంబం కొన్నాళ్ల క్రితం మహారాష్ట్ర వెళ్లి షోలాపూర్‌లో స్థిరపడింది. 
 
స్వగ్రామానికి చెందిన అబ్బాయితో పెద్దలు ఆమెకు పెళ్లి కుదిర్చారు. నిన్న ఉదయం 8:10 గంటలకు ముహూర్తం కాగా, ఇరు కుటుంబాల వారు ఉదయాన్నే పెళ్లి మండపానికి చేరకుని ఏర్పాట్లు పూర్తి చేశారు. వధూవరులిద్దరూ పీటలపై కూర్చున్నారు. 
 
పురోహితుడు వేదమంత్రాలు చదువుతూ పెళ్లి తంతు పూర్తి చేస్తున్నాడు. ముహూర్తం రానే వచ్చింది. వధువు తలపై జీలకర్ర, బెల్లం పెట్టాల్సిందిగా వరుడిని పురోహితుడు కోరాడు. అతడు చేయి పైకెత్తాడు. అంతే.. వధువు ఒక్కసారిగా ఆపండి అని కేకపెట్టింది. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదంటూ పెళ్లి పీటల నుంచి పక్కకు తప్పుకుంది. 
 
అప్పటివరకు మేళతాళాలతో సందడిగా కనిపించిన కళ్యాణ మండపం .. కాసేపు నిశ్శబ్దంగా మారిపోయింది. ఏం జరిగిందో అర్థంకాక పురోహితుడు, ఇరు కుటుంబాల పెద్దలు, పెళ్లికొచ్చిన అతిథులు షాకయ్యారు.
 
షోలాపూర్ నుంచి వచ్చిన స్నేహితుడిని చూడగానే వధువు ఒక్కసారిగా తన మనసు మార్చుకుంది. పెళ్లి ఇష్టం లేదని పీటల పైనుంచి తప్పుకుని పరుగెత్తుకుంటూ వెళ్లి అతడిని కౌగలించుకుంది. ఈ ఘటనతో నివ్వెరపోయిన ఇరు కుటుంబాల వారు తేరుకుని పెళ్లికొచ్చిన వధువు స్నేహితుడిపై దాడికి దిగారు.

వారి నుంచి తప్పించుకున్న యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కొన్నిరోజులుగా ఆ యువకుడిని యువతి ప్రేమిస్తోంది. అయితే వారి ప్రేమను భగ్నం చేసిన కుటుంబ సభ్యులు వేరే పెళ్ళి చేయడానికి సిద్ధమయ్యారు. దీనితో యువతి ఇలా చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లోకి కరోనా వైరస్.. ఆప్ఘన్ నుంచి వచ్చేస్తోందట..