ఊరేగింపులో పెళ్లి కొడుకు డ్యాన్స్.. డీజే సౌండ్‌ కొంపముంచింది.. మృతి

శనివారం, 15 ఫిబ్రవరి 2020 (13:01 IST)
వివాహమైన రోజునే పెళ్లి కుమారుడు చనిపోయాడు. శుక్రవారం ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలో చోటుచేసుకుంది. శుక్రవారం గణేష్‌కు పెళ్లి జరిగింది. రాత్రి పెళ్లి వేడుకలో భాగంగా బారాత్‌ నిర్వహించారు. ఊరేగింపులో, బంధువులు, ఫ్రెండ్స్‌తో కలిసి సంతోషంగా పెళ్లి కుమారుడు డ్యాన్స్‌ చేశాడు. 
 
అయితే డీజే సౌండ్‌కు అస్వస్థతకు గురైన గణేష్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. బంధువులు ఆయన్నుఆస్పత్రికి తరలించగా..అప్పటికే గుండేపోటుతో మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనతో  రెండు కుటుంబాల సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పెళ్లి జరిగిన ఇంట విషాదం నెలకొంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఎన్డీయేలో ఎలా చేరుతారు?: వైసీపీకి సీపీఐ సూటి ప్రశ్న