Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చీర బాగోలేదని పెళ్లి రద్దు.. ఎక్కడ?

Advertiesment
చీర బాగోలేదని పెళ్లి రద్దు.. ఎక్కడ?
, ఆదివారం, 9 ఫిబ్రవరి 2020 (10:49 IST)
చీర బాగోలేదనే కారణంగా ఓ వివాహం రద్దైంది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని హసన్ జిల్లాలోని ఒకే గ్రామానికి చెందిన వధూవరులకు వివాహం ఖాయమైంది. పెళ్లి కొడుకు రఘు కుమార్, పెళ్లి కుమార్తె సంగీత ఏడాదిగా ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి తల్లిదండ్రులు కూడా వీరి ప్రేమకు అంగీకారం తెలపడంతో వివాహ ముహుర్తం నిశ్చయించారు. 
 
పెళ్లికి ముందురోజు ఈ చీర గొడవ తలెత్తింది. పెళ్లి కుమార్తె చీర నాణ్యతను పెళ్లి కుమారుడి తల్లిదండ్రులు ఆక్షేపించారు. అనంతరం వరుడు, వధువు కుటుంబాల మధ్య వాగ్వాదం ఏర్పడి అది ఘర్షణకు దారితీసింది. కేవలం చీర బాగాలేదనే కారణంగా ఓ పెళ్లి రద్దైంది. ఈ ఘటనపై వరుడు తల్లిదండ్రులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, వరుడు రఘు కుమార్ పరారైనట్లు పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో ఘోరం.. యువతిపై మైనర్ల సామూహిక అత్యాచారం