Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణలో ఘోరం.. యువతిపై మైనర్ల సామూహిక అత్యాచారం

Advertiesment
తెలంగాణలో ఘోరం.. యువతిపై మైనర్ల సామూహిక అత్యాచారం
, ఆదివారం, 9 ఫిబ్రవరి 2020 (10:16 IST)
తెలంగాణలో ఓ ఘోరం జరిగింది. దిశ హత్యాచార ఘటన తర్వాత దోషులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నా.. అమ్మాయిలపై అత్యాచారాల పరంపర మాత్రం కొనసాగుతోంది. వివరాల్లోకి వెళితే.. స్నేహం పేరిట ఓ యువతిని నమ్మించి మోసం చేశాడు. ఆమెను నిర్జీవ ప్రాంతానికి తీసుకువెళ్లి అతని స్నేహితులతో కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే ఈ దారుణ ఘటనకు పాల్పడినవారంతా మైనర్లే కావడం గమనార్హం. 
 
ఈ ఘటన వరంగల్ జిల్లా మహబూబాబాద్‌ గ్రామీణ మండలంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఓ తండాకు చెందిన 16 ఏళ్ల బాలుడు  హైదరాబాద్‌లో క్యాటరింగ్‌ పనులు చేస్తున్నాడు. అయితే అక్కడ అతనికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఇటీవలే సొంతూరుకు వచ్చిన ఆ బాలుడు యువతికి ఫోన్‌చేసి తన ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. 
 
ఆమెను తొలుత ఆటోలో తండాకు తీసుకెళ్లి అక్కడి నుంచి సమీపాన ఉన్న మామిడి తోటకు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఆ బాలుడి స్నేహితులంతా చేరుకున్నారు. అదే తండాకే చెందిన ఇద్దరు, మహబూబాబాద్‌ పట్టణానికి చెందిన మరో ఇద్దరు, తొర్రూరుకు చెందిన ఓ బాలుడు ఉన్నారు. 
 
వీళ్లంతా కలిసి పక్కా ప్లాన్ వేశారు. ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆరుగురిపై కేసు నమోదుచేసి పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో ముగిసిన ఎన్నికల పోలింగ్.. ఎగ్జిట్ పోల్స్‌లో ఆప్‌కే పట్టం..