Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ కప్ కోసం భారత జట్టు ఇదే... రాయుడుకు మొండిచేయి

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (15:42 IST)
ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత క్రికెట్ జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యుల్లో హైదరాబాద్ ఆటగాడు అంబటి రాయుడు, రిషబ్ పంత్‌కు చోటు దక్కలేదు. ఈ విషయాన్ని చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ సోమవారం మీడియాలో సమావేశంలో వెల్లడించారు. ఈ మెగా ఈవెంట్ కోసం ఆటగాళ్ళ ప్రతిభ, ఫిట్నెస్ సామర్థ్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేసినట్టు చెప్పారు. 
 
ఈ టోర్నీకోసం ప్రకటించిన జట్టులో విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఎంఎస్. ధోనీ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ సింగ్ బూమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మొహ్మద్ షమీలు ఉన్నారు. 
 
జట్టులో ప్రధాన పేసర్లుగా భువనేశ్వర్, బుమ్రా, షమీలను ఎంపిక చేయగా, స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, చాహల్‌లను ఎంపిక చేశారు. ఆల్ రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, జడేజా, జాధవ్, విజయ్ శంకర్‌లకు జట్టులో స్థానం దక్కింది. 
 
ఇదిలావుండగా, జట్టు ఎంపిక కోసం సుప్రీంకోర్టు నియమిత కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఎఏ) సోమవారం సమావేశమైంది. ముంబైలోని బీసీసీఐ క్రికెట్ సెంటరులో ఈ భేటీ జరిగింది. ఇందులో చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, కెప్టెన్ కోహ్లీ, చీఫ్ కోచ్ రవిశాస్త్రి సహా పలువురు బీసీసీఐ ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'నువ్వు చాలా అందంగా ఉంటావు.. నిన్ను ఎవరైనా ప్రేమిస్తే నేనేం చేయాలి' : యువతి సూసైడ్

జగన్ బాటలో కేటీఆర్.. తెలంగాణలో మేం అధికారంలోకి వస్తే..?

వివేకా కుమార్తె సునీత భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ షర్మిల

రాంగోపాల్ వర్మపై తొందరపాటు చర్యలు వద్దు : ఏపీ హైకోర్టు

భూలోక స్వర్గాన్ని తలపించే తిరుమల కొండలు.. హిమపాతంతో అద్భుతం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

తర్వాతి కథనం
Show comments