Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు కోహ్లీ వరల్డ్ కప్ అందిచ్చేనా? (video)

Webdunia
శుక్రవారం, 17 మే 2019 (14:11 IST)
ఈ నెలాఖరు నుంచి ఐసీసీ వరల్డ్ కప్ మెగా ఈవెంట్ జరుగనుంది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా ఈ టోర్నీ జరుగనుంది. ఇందుకోసం టీమిండియా కోసం 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు విరాట్ కోహ్లీ సారథ్యం వహిస్తున్నారు. 
 
అయితే, కోహ్లీకి ఇది మూడో ప్రపంచ కప్. తొలిసారి 2011 ప్రపంచ కప్‌లో ఆడిన కోహ్లీ, 21 ఏళ్లకే వరల్డ్ చాంపియన్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత 2015 వరల్డ్ కప్‌లో ఆడగా ఇపుడు జరిగే టోర్నీలో భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. 
 
అయితే, 2011లో జరిగిన వరల్డ్ కప్‌లో కోహ్లీ బంగ్లాదేశ్‌పై సెంచరీ చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి 200 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అటు శ్రీలంకతో జరిగిన ఫైనల్లో ధోనీ హెలికాప్టర్ షాట్, గౌతం గంభీర్ అద్భుత ఇన్నింగ్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ ఇదే ఇన్నింగ్స్‌లో గంభీర్‌తో, కోహ్లీ అమూల్యమైన 85 పరుగుల భాగస్వామ్యం భారత్ విజయానికి చాలా కీలకం అయ్యింది.
 
ఇకపోతే, 2015 వరల్డ్ కప్‌ ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లో జరిగింది. ఈ టోర్నీలో పాకిస్థాన్‌తో కోహ్లీ 126 బంతుల్లో 107 రన్స్ చేశాడు. భారత్ ఈ మ్యాచ్‌ను 76 పరుగులతో గెలిచింది. కోహ్లీ ఈ టోర్నీలో ఎన్నో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వాటి సాయంతో భారత్ తన గ్రూప్‌లో టాప్‌లో నిలిచింది. అయితే ఆస్ట్రేలియాపై సెమీఫైనల్లో కోహ్లీ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి రనౌట్ అయ్యాడు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. 
 
ఈ నేపథ్యంలో ఇపుడు ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా వరల్డ్ కప్ టోర్నీ జరుగనుంది. ఇది కోహ్లీకి మూడో ప్రపంచ కప్. కోహ్లీ గత కొన్నేళ్లుగా అద్భుతమైన ఫాంలో ఉన్నాడు. అతడి బ్యాట్‌ నుంచి వరుసగా సెంచరీలు జాలువారుతున్నాయి. కోహ్లీ ఇప్పుడు తన కెరీర్ పీక్స్‌లో ఉన్నాడని క్రీడా నిపుణులు చెబుతున్నారు. భారత జట్టు కూడా పక్కాగా, సమతూకంతో ఉంది. టీమిండియాలో అనుభవజ్ఞులు, యువకుల అద్భుత మిశ్రమం కనిపిస్తోంది. 
 
జట్టులో మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఉన్నాడు, అతడు బహుశా తన చివరి వరల్డ్ కప్ ఆడబోతున్నాడు. కోహ్లీ టీమ్ ఐసీసీ వరల్డ్ కప్ 2019 గెలవగలదా? అభిమానులు మాత్రం ఈ వరల్డ్ కప్ కోహ్లీది, ఇండియాదే అని గట్టిగా నమ్ముతున్నారు. మరి కోట్లాది మంది భారతీయుల కోరికను కోహ్లీ నెరవేర్చుతాడా లేదా అన్నది వేచిచూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

తర్వాతి కథనం
Show comments