బాబా గుర్మీత్ రహీం సింగ్ వద్ద విరాట్ కోహ్లీ ఆశీస్సులు... వీడియో వైరల్

బాలికపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద గురువు ‘స్వచ్ఛ సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్’ వద్ద భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆశీస్సులు పొందుతున్నట్టుగా ఉన్న వీడియో ఒ

Webdunia
శుక్రవారం, 25 ఆగస్టు 2017 (14:09 IST)
బాలికపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద గురువు ‘స్వచ్ఛ సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్’ వద్ద భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆశీస్సులు పొందుతున్నట్టుగా ఉన్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
నిజానికి ఈ అత్యాచార కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం తుది తీర్పును వెలువరించనుంది. దీంతో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో హైటెన్షన్ నెలకొనివుంది. ఫలితంగా ఇరు రాష్ట్రాల్లో పారామిలిటరీ బలగాలను మొహరించారు. పైగా, ఈ అంశం ఇపుడు దేశ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. 
 
 
ఈ నేపథ్యంలో... గుర్మీత్ సింగ్‌కు సంబంధించిన అన్ని అంశాల‌పై నెటిజ‌న్లు అనేక ఆసక్తికర పోస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా 2016లో టీమిండియా ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, ఆశిష్ నెహ్రూ, విజయ్ దహియా ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్ల‌గా తీసిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.
 
అందులో వారంతా స‌ద‌రు వివాదాస్ప‌ద బాబా ఆశీస్సులు తీసుకుంటున్నారు. టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ సాధించిన విజయాల వెనుక తన పాత్ర ఉంద‌ని ప‌లుసార్లు చెప్పుకున్నారు. తాను ఇచ్చిన స‌ల‌హాల‌తోనే కోహ్లీ రాణిస్తున్నాడ‌ని అన్నారు. అంతేకాదు. బాక్స‌ర్ విజ‌యేంద‌ర్ సింగ్ కూడా తన శిష్యుడేన‌ని, త‌న‌ అశీస్సులు తీసుకున్న తర్వాతే రాణించాడ‌ని ఆ బాబా వ్యాఖ్య‌లు చేసేవారు.
 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

Debts: అప్పుల బాధ ఆ కుటుంబాన్నే మింగేసింది.. ఎక్కడ.. ఏం జరిగింది..?

50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్‌ను ప్రకటించిన హెచ్‌ఎంఐఎఫ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

తర్వాతి కథనం
Show comments