Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐసీసీ ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో నిలిచిన విరాట్ కోహ్లీ.. టాప్-10లో లేని బౌలర్లు, బ్యాట్స్‌మెన్లు

తాజాగా ఐసీసీ విడుదల చేసిన పరిమిత ఓవర్ల వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా సారథి, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. 873 పాయింట్లతో కోహ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, ఆస్ట్రేలియా

Advertiesment
ఐసీసీ ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో నిలిచిన విరాట్ కోహ్లీ.. టాప్-10లో లేని బౌలర్లు, బ్యాట్స్‌మెన్లు
, శుక్రవారం, 18 ఆగస్టు 2017 (18:12 IST)
తాజాగా ఐసీసీ విడుదల చేసిన పరిమిత ఓవర్ల వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా సారథి, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. 873 పాయింట్లతో కోహ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ 861 పాయింట్లతో రెండో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. కోహ్లీ మినహా టీమిండియా బ్యాట్స్‌మెన్లు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించలేకపోయారు. 
 
ఈ ర్యాకింగ్స్‌లో ధోనీ 12వ స్థానంలో, శిఖర్ ధావన్ 13, రోహిత్ శర్మ 14వ స్థానంలో నిలిచారు. మ‌రోవైపు వ‌న్డే బౌల‌ర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియాలో ఒక్క బౌల‌ర్‌కి కూడా చోటు ద‌క్క‌లేదు. టీమిండియా పేస‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ 13వ స్థానంలో ఉన్నాడు. జట్టు విషయానికొస్తే టీమిండియా ర్యాంకింగ్స్‌లో మూడో స్థానాన్ని సొంతం చేసుకుంది.
 
ఐసీసీ జట్టు ర్యాంకింగ్స్‌లో భారత్ మూడో స్థానాన్ని కొనసాగించాలంటే.. శ్రీలంక‌తో జ‌ర‌గ‌నున్న వ‌న్డేల్లో టీమిండియా 4-1 తేడాతో గెలవాల్సి ఉంది. ప్ర‌స్తుతం టీమిండియా ఖాతాలో 114 పాయింట్లు ఉన్నాయి. ఒక‌వేళ శ్రీలంక‌తో జ‌రిగే వ‌న్డే సిరీస్‌లో భార‌త్ 3-2 తేడాతో గెలిచినా భార‌త్ మూడో స్థానంలో నిల‌బ‌డే ఛాన్సుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధోనీలో ఆ సత్తా ఉంది.. 2019 ప్రపంచకప్ తర్వాత చెప్పలేం: మైక్ హస్సీ