విరాట్ కోహ్లీకి చేరువలో మరో రికార్డు... ఏంటది?
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి చేరువలో మరో అరుదైన రికార్డు వేచివుంది. ప్రస్తుతం శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడుతున్న కోహ్లీ... గురువారం భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగే వన్డే ద్వారా ఈ అరుదైన రి
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి చేరువలో మరో అరుదైన రికార్డు వేచివుంది. ప్రస్తుతం శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడుతున్న కోహ్లీ... గురువారం భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగే వన్డే ద్వారా ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకునే అవకాశం ఉంది. ఆ రికార్డు ఏంటంటే...
ఒకే క్యాలెండర్ ఇయర్‌లో వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించడం. ఇప్పటివరకు కోహ్లీ ఈ క్యాలెండర్ ఇయర్‌లో 14 వన్డే మ్యాచ్‌లు ఆడి 769 పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు డుప్లిసెస్ 814(16 వన్డేల్లో) పరుగులతో అగ్రస్థానంలో ఉండగా ఇంగ్లాండ్ సారథి రూట్ 785(14 వన్డేల్లో) పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
అయితే, డుప్లిసెస్ కంటే 45, రూట్ కంటే 16 పరుగుల వెనుకంజలోనే కోహ్లీ ఉన్నాడు. లంక ఆటగాళ్లపై తొలి వన్డేలో విరుచుకుపడిన కోహ్లీ రెండో వన్డేలోనూ అదే ప్రదర్శన పునరావృత్తం చేస్తే డుప్లిసెస్, రూట్ రికార్డులు బద్దలవ్వడం ఖాయంగా తెలుస్తోంది. తద్వారా దీంతో వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు పుటలకెక్కనున్నాడు.
తర్వాత కూడా కోహ్లీ రికార్డు బద్దలవ్వడానికి అవకాశమే లేనట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే భారత్-శ్రీలంక మధ్య మిగతా వన్డేలు జరగాల్సి ఉంది. ఆ తర్వాత డిసెంబరు చివరి నాటికి ఆస్ట్రేలియా, శ్రీలంకతో కలుపుకుని దాదాపు 11 వన్డేలు ఆడాల్సి ఉంది. సెప్టెంబరులో ఇంగ్లాండ్-వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ జరగనుంది. క్యాలెండర్ ఇయర్ ముగిసే నాటికి కోహ్లీ తన ఫామ్‌ని కొనసాగిస్తే వెయ్యి పరుగులు దాటే అవకాశం లేకపోలేదు.