Webdunia - Bharat's app for daily news and videos

Install App

WCL 2025: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సంగతేంటి?

సెల్వి
బుధవారం, 30 జులై 2025 (12:50 IST)
India Vs Pakistan
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో భారత్ సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. భారత ఛాంపియన్స్ జట్టు చివరి లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే, టోర్నీ ఆరంభంలోనే పాక్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను భారత ఆటగాళ్లు పహల్గామ్ ఉగ్రదాడి కారణంగా ఆడేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. అప్పుడు మ్యాచ్ రద్దయ్యింది.  
 
మరోవైపు పాకిస్తాన్ - ఆస్ట్రేలియా మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు మొదలయ్యాయి. ఆస్ట్రేలియా జట్టు బలమైన ఆటగాళ్లతో ఉన్నా కేవలం 11.5 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌట్ అయింది. పాక్ జట్టు కేవలం 8 ఓవర్లలో మ్యాచ్ గెలవడం పట్ల అనేక అనుమానాలు వెలువడుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో భారత ఛాంపియన్స్ జట్టు పాక్‌తో భారత్ సెమీఫైనల్ ఆడుతుందా? లేదా మళ్లీ తప్పుకుంటుందా? అనేది తెలియాల్సి వుంది. ఒక వేళ తప్పుకుంటే పాకిస్తాన్ నేరుగా ఫైనల్‌కి వెళ్లిపోతుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగాల్సి ఉంది. ఇది జరిగితే గ్రూప్ స్టేజ్‌లో ఆడకుండా, సెమీ ఫైనల్‌లో ఆడినందుకు విమర్శలు ఎదురవుతాయి. 
 
మరో ఆసక్తికర విషయం ఏంటంటే, ఆసియా కప్ 2025లో కూడా భారత్, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. అక్కడ కూడా రెండు జట్లు ఎదురెదురుగా తలపడే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు అందరి దృష్టి భారత క్రికెట్ బోర్డు, జట్టు యాజమాన్యం తీసుకునే నిర్ణయంపై ఉంది. జూలై 31న సెమీఫైనల్ జరగాల్సి ఉన్నా, మ్యాచ్ ఖచ్చితంగా జరుగుతుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ లెజెండ్స్ సెమీఫైనల్ పోరు నుండి టాప్ స్పాన్సర్లు వైదొలిగుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

100 మంది అమ్మాయిల్లో నలుగురే పవిత్రులు: ప్రేమానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీకి అనుకూలంగా విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెస్ సర్కార్: కేసీఆర్ ఫైర్

Prakash Raj: బెట్టింగ్ యాప్‌ కేసు.. ఈడీ ముందు హాజరైన ప్రకాష్ రాజ్

మణికొండలో దారుణం : వాటర్ ట్యాంకు ఢీకొని టెక్కీ దుర్మరణం

ఒక్కో బిడ్డను కంటే నగదు బహుమతి... చైనా సరికొత్త ప్రణాళిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

తర్వాతి కథనం
Show comments