Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లి సెంచరీలకు రెండేళ్లు.. 99.99, 99.97 పర్సంటేజ్ మార్కులు..?

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (17:32 IST)
టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సెంచరీ సాధించి దాదాపు రెండేళ్లవుతుంది. క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తర్వాత కోహ్లికి సెంచరీలు లేకపోవడం ఇదే తొలిసారి. కోహ్లి ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆడుతున్న సంగతి తెలిసిందే.

నాటింగ్‌హమ్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో​ కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. అయితే వర్షం అంతరాయం కలిగించడంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ ఆడే అవకాశం రాలేదు. ఇక లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేసి ఔటయ్యాడు. 
 
ఈ నేపథ్యంలో కోహ్లీ సెంచరీల కొరతపై టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ తనదైన శైలిలో పంచ్‌లు విసిరాడు. 99.99, 99.97 పర్సంటేజ్ మార్కులు తెచ్చుకున్న ఇద్దరు స్టూడెంట్స్ మెరుగైన మార్కుల కోసం మళ్లీ పరీక్ష రాసారనే వార్తను షేర్ చేస్తూ ఇది కోహ్లీకి కూడా వర్తిస్తుందంటూ సెటైర్లు పేల్చాడు.
 
కోహ్లీ కూడా సెంచరీ సాధిస్తేనే అభిమానులు సంతోషంగా ఉంటారని, అలా కాదని ఎన్ని పరుగులు చేసినా.. అతను ఫామ్‌లో లేనట్లేననే ఉద్దేశంలో ట్వీట్ చేశాడు.

మృదుల్ అగర్వాల్, కావ్య చోప్రా అనే ఇద్దరు విద్యార్థులు ఈ ఏడాది ఫిబ్రవరి జరిగిన జేఈఈ పరీక్షలో 99.99, 99.97 పర్సంటేజ్ సాధించారు. ఈ ఫలితాలకు సంతృప్తి పడని వారు మళ్లీ పరీక్షలు రాసి 100 పర్సంటేజ్ సాధించారు. 300 మార్కులు 300 సాధించారు. రోజులు 6-8 గంటలు చదివేవాళ్లమని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం ఎందుకు, చర్చికి వెళ్లి చదవండి జగన్: చంద్రబాబు

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

ఒక్క సంతకం పెట్టి శ్రీవారిని జగన్ దర్శనం చేసుకోవచ్చు : రఘునందన్ రావు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

తర్వాతి కథనం
Show comments