Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

జెఈఈ మెయిన్స్‌ 2021 థర్డ్ సెషన్‌లో 99%కు పైగా స్కోర్‌‌తో హైదరాబాద్ ఆరుగురు ఆకాష్‌ ఇనిస్టిట్యూట్‌ విద్యార్థులు

Advertiesment
Six students
, ఆదివారం, 8 ఆగస్టు 2021 (18:54 IST)
ఆకాష్‌ ఇనిస్టిట్యూట్‌, హైదరాబాద్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు ఇనిస్టిట్యూట్‌కు మాత్రమే కాకుండా తెలంగాణా రాష్ట్రానికి సైతం గర్వకారణంగా నిలుస్తూ 99 పర్సంటైల్‌‌కు పైగా మార్కులను జెఈఈ మెయిన్స్‌ 2021 పరీక్షల మూడవ సెషన్‌లో సాధించారు. ఈ ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ సంస్థ ఇటీవలనే వెల్లడించింది. ఈ సంవత్సరం జరుగనున్న నాలుగు ఉమ్మడి ప్రవేశ పరీక్షలలో ఇది మూడవది.
 
హైదరాబాద్‌ నుంచి 99 పర్సంటైల్‌ మార్కులను సాధించిన విద్యార్ధులలో శ్రీనికేతన్‌ జోషి, అన్మోల్‌ కురోథ్‌, మృణాల్‌ కుట్టేరి, కెఎస్‌ మార్కండ్‌, ఆదిత్య కల్లూరి, అనికేత్‌ పరకాల ఉన్నారు. ఐఐటీ జెఈఈ లో మంచి మార్కులు సాధించడం కోసం ఈ విద్యార్థులు రెండు సంవత్సరాల క్లాస్‌ రూమ్‌ ప్రోగ్రామ్‌లో ఆకాష్‌ ఇనిస్టిట్యూట్‌ వద్ద ఈ విద్యార్థులు చేరారు.
 
కాన్సెప్ట్స్‌ను అర్థం చేసుకోవడం, తమ అభ్యాస షెడ్యూల్స్‌కు కట్టుబడి ఉండటం ద్వారా వారు ఈ పర్సంటైల్‌ సాధించారు. ‘‘ఆకాష్‌ ఇనిస్టిట్యూట్‌ తమకు అన్ని విధాలుగా సహకరించింది. అతి తక్కువ సమయంలోనే విభిన్న అంశాలలో ఎన్నో కాన్సెప్ట్స్‌ను తాము నేర్వగలిగామని, ఆకాష్‌ దానికి పూర్తిగా మద్దతునందించింద’’ని విద్యార్థులు అన్నారు.
 
ఆకాష్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఈఎస్‌ఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌, శ్రీ  ఆకాష్‌ చౌదరి మాట్లాడుతూ ‘‘హైదరాబాద్‌ ఇనిస్టిట్యూట్‌కు చెందిన విద్యార్థులు సాధించిన అసాధారణ ఫీట్‌ను మేము అభినందిస్తున్నాం. జెఈఈ మెయిన్‌ 2021 కోసం దేశవ్యాప్తంగా 7 లక్షల మందికి పైగావిద్యార్థులు నమోదు చేసుకున్నారు. టాప్‌ పర్సంటైల్‌ స్కోర్‌ చేయడమన్నది వారి కష్టం,  అంకిత భావం, వారి తల్లిదండ్రుల మద్దతు గురించి పుంఖానుపుంఖాలుగా వెల్లడిస్తుంది. వారి భావి ప్రయత్నాలలో సైతం వారు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాము’’ అని అన్నారు.
 
ఆయనే మాట్లాడుతూ ‘‘మహమ్మారి ప్రభావిత విద్యాసంవత్సరంలో , విద్యార్థులు జెఈఈలో అగ్రస్థానంలో నిలిచేందుకు మేము మరింతగా కృషి చేశాము. మా డిజిటల్‌ ఉనికి, నిరంతరం విద్యార్థులకు అందుబాటులో ఉంచడంతో పాటుగా క్వశ్చన్‌ బ్యాంక్‌లను సైతం అందుబాటులో ఉంచాము. అలాగే వర్ట్యువల్‌ మోటివేషనల్‌ సదస్సులు, పరీక్షల తర్ఫీదుపై సెమినార్లు, టైమ్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాల ద్వారా శిక్షణ అందించడాని తగిన ఫలితం దక్కింది. మా విద్యార్థులలో అధికశాతం మంది అత్యున్నత ఐఐటీ లేదా నిట్‌ లేదా కేంద్ర ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలో చేరేందుకు అవకాశాలను సొంతం చేసుకున్నారు’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో కొత్తగా మరో 2050 పాజిటివ్ కేసులు