Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్న విరాట్ కోహ్లీ

Webdunia
బుధవారం, 15 జనవరి 2020 (13:45 IST)
భారతక్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. టెస్టులు, వన్డేలు, ట్వంటీ20 ఫార్మెట్‌లలో అమితంగా రాణిస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. పైగా, పలు సందర్భాల్లో జట్టును ఒంటి చేత్తో గెలిపిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఖాతాలో మరో ప్రతిష్టాత్మక అవార్డు వచ్చి చేరింది. 
 
సాధారణంగా ప్రతి యేడాది ఐసీసీ వివిధ రకాల వార్షిక అవార్డులను ఇస్తూ వస్తోంది. ఈకోవలోనే 2019 సంవత్సరానికిగాను అన్ని ఫార్మాట్లలో, అన్ని విభాగాల్లోనూ ఉత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఇందులో భారత కెప్టెన్‌, రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లి స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ అవార్డుకు ఎంపికయ్యాడు. 
 
2019 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్‌ స్మిత్‌ను ప్రోత్సహించాలని విరాట్‌ తన సైగల ద్వారా అభిమానులకు సూచించాడు. ఎందుకంటే, దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో స్మిత్‌ కెప్టెన్సీలో.. వార్నర్‌ సహా మరో ఆటగాడు బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడిన విషయం తెల్సిందే. 
 
దీంతో స్మిత్‌, వార్నర్‌లకు ఏడాది నిషేధం విధించింది. నిషేధం పూర్తయిన తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన స్మిత్‌ను ఎవరూ పట్టించుకోకపోయే సరికి కోహ్లీ అభిమానులకు తన సైగల ద్వారా స్మిత్‌ను ప్రోత్సహించాలని సూచించాడు. ఇందుకుగానూ కోహ్లీకి స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ అవార్డు లభించింది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments