Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిడ్డ తల్లి సక్సెస్ : హోబర్ట్ క్వార్టర్స్‌లో సానియా

Webdunia
బుధవారం, 15 జనవరి 2020 (11:00 IST)
భారత టెన్నిస్ ఏస్, హైదరాబాద్ క్రీడాకారిణి సానియా మీర్జా తల్లిగా మారిన తర్వాత వేసిన తొలి అడుగు విజయవంతంమైంది. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అంటే రెండున్నరేళ్ళ తర్వాత ఆమె తిరిగి రాకెట్ చేతపట్టి మైదానంలోకి దిగింది. అయితే, ఆమె ఆడిన తొలి మ్యాచ్‌లోని విజయం సాధించింది. ఫలితంగా హోబర్ట్ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. 
 
అస్ట్రేలియా వేదికగా హోబర్ట్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నీ జరుగుతోంది. ఇందులో మహిళల డబుల్స్‌ విభాగంలో ఉక్రెయిన్ క్రీడాకారిణి నాదియ కిచినోక్‌తో కలిసి సానియా మీర్జా బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో సానియా జోడీ 2-6, 7-6(3), 10-3 తేడాతో ఒకసన కలష్నికోవా(జార్జియా), మియుకాటో(జపాన్)జోడీని కంగుతినిపించింది.
 
దాదాపుగా గంటన్నరకు‌పైగా సాగిన ఈ పోటీ హోరాహోరీగా సాగింది. తొలి సెట్లో ప్రత్యర్థి జోడీకి తేలిగ్గా లొంగిపోయిన సానియా జోడీ రెండో సెట్లో గట్టి పోటీ నిస్తూ.. విజయం సాధించింది. మ్యాచ్ నిర్ణయాత్మకమైన మూడో సెట్ నువ్వా? నేనా? అన్నట్లు ఆట సాగింది. చివరికి సానియా-నాదియా జోడీ ఆట ముందు కలష్నికోవా-మియుకాటో  జోడీ నిలువలేకపోయింది.
 
ఈ విజయంపై సానియా మీర్జా ట్వీట్ చేసింది. "ఈ రోజు నా జీవితంలో ప్రత్యేకమైన రోజు. నా తల్లిదండ్రులు, నా కుమారుడు నాకు మద్దతుగా నిలిచారు. దాదాపుగా రెండున్నరేళ్ల తర్వాత టెన్నిస్ ఆడుతూ తొలి రౌండ్‌లో నెగ్గాను. నేను విజయం సాధించాలని సందేశాలు పంపిన వారందరికి ధన్యవాదాలు" అంటూ ట్వీట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments