Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండగపూట సెంచరీలతో ఉతికి ఆరేసిన కంగారులు.. భారత్ చిత్తు

Webdunia
బుధవారం, 15 జనవరి 2020 (10:49 IST)
ముంబై వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారం తొలి వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కంగారులు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫలితంగా భారత బౌలర్లను ఉతికి ఆరేశారు. దీంతో భారత్ నిర్ధేశించిన విజయలక్ష్యాన్ని ఓపెనర్లిద్దరే ఛేదించారు. ఈ విజయంతో ఈ వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. 
 
మంగళవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి వన్డే జరిగింది. ఇందులో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 49.1 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ 10, శిఖర్ ధావన్ 74, రాహుల్ 47, కోహ్లీ 16, అయ్యర్ 4, పంత్ 28, జడేజా 25, ఠాకూర్ 13, షమి 10, కుల్దీప్ యాదవ్ 17 చొప్పున పరుగులు చేయగా అదనపు పరుగుల రూపంలో 11 రన్స్ వచ్చాయి. 
 
ఆ తర్వాత 256 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు ఒక్క వికెట్ కోల్పోకుండానే విజయం సాధించింది. జట్టు ఓపెనర్లు ఆరోన్ ఫించ్ 110 (నాటౌట్), డేవిడ్ వార్నర్ 128 (నాటౌట్)లతో సెంచరీలు మోత మోగించారు. ఫలితంగా భారత బౌలర్లు, బ్యాట్స్‌మెన్లు నిస్తేజంగా ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయారు. ఈ సిరీస్‌లో రెండో వన్డే జనవరి 17న రాజ్‌కోట్‌ వేదికగా జరుగనుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments