Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ- లారా రికార్డ్ సమం (వీడియో)

భారత్- శ్రీలంకకు మధ్య నాగ్ పూర్‌లో జరుగుతున్న టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు టీమిండియా బ్యాట్స్‌మెన్లు. రెండో రోజు ఆటలో లంక బౌలర్లు టీమిండియా ఆటగాళ్లను కట్టడి చేయలే

Webdunia
ఆదివారం, 26 నవంబరు 2017 (15:55 IST)
భారత్- శ్రీలంకకు మధ్య నాగ్ పూర్‌లో జరుగుతున్న టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు టీమిండియా బ్యాట్స్‌మెన్లు. రెండో రోజు ఆటలో లంక  బౌలర్లు టీమిండియా ఆటగాళ్లను కట్టడి చేయలేకపోయారు. మురళీ విజయ్ సెంచరీతో అదరగొట్టగా, ఛటేశ్వర్ పూజారా హాఫ్ సెంచరీ చేశాడు. ఓపెనర్ మురళీ విజయ్ టెస్టుల్లో 10వ సెంచరీ పూర్తి చేసుకోగా పూజారా 17వ హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. 
 
ఆపై క్రీజులో నిలదొక్కుకున్న కోహ్ల డ‌బుల్ సెంచ‌రీ బాదాడు. 167.5 ఓవ‌ర్ల వ‌ద్ద సింగిల్‌ చేసి 200 ప‌రుగులు (259 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. తద్వారా కెప్టెన్‌గా అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన రికార్డును తన ఖాతాలో వేసుకుని.. లారా రికార్డుకు సమంగా నిలిచాడు. 
 
మరోవైపు కోహ్లీ డబుల్ సెంచరీతో పాటు ముర‌ళీ విజ‌య్ (128), చ‌టేశ్వ‌ర్ పుజారా (143) అద్భుతంగా రాణించ‌డం, రోహిత్ శర్మ అర్థశతకం బాదడంతో టీమిండియా స్కోరు బోర్డు పరుగులు తీస్తోంది. ఇక కోహ్లీ ప్రస్తుతం సాధించిన డబుల్ సెంచరీతో టెస్టుల్లో ఐదో డబుల్ సెంచరీ సాధించినట్లైంది. ఈ క్రమంలో భారత్ 174.4 ఓవర్లలో 1048 బంతులాడి 600 పరుగులు సాధించింది. 

సంబంధిత వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

తర్వాతి కథనం
Show comments