ఐపీఎల్ తొలి జట్టుగా కేకేఆర్ సరికొత్త రికార్డు

ఠాగూర్
శుక్రవారం, 4 ఏప్రియల్ 2025 (10:18 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గురువారం హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 80 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో కేకేఆర్ జట్టు ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. టోర్నీ చరిత్రలో మూడు జట్లపై 20 అంతకంటే ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. 
 
ఇప్పటివరకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై 20, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై 20, పంజాబ్ కింగ్స్‌పై 21 చొప్పున విజయాలు నమోదు చేసుకుంది. అలాగే, సన్‌‍ రైజర్స్‌పై 2023-25 మధ్య వరుసగా 5 మ్యాచ్‌లలో కోల్‌కతా విజయం సాధించడం గమనార్హం. 
 
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా 2023-25 మధ్య వరుసగా ఐదు మ్యాచ్‌లలో హైదరాబాద్ జట్టుపై వరుసగా ఐదు మ్యాచ్‌లలో గెలుపొందింది. కాగా, ఐపీఎల్‌లో రన్స్‌‌పరంగా గురువారం నాటి మ్యాచ్‌లోనే సన్ రైజర్స్‌కు భారీ ఓటమి ఎదురైంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఏకంగా 80 పరుగులు తేడాతో ఓడిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శాతవాహన ఎక్స్‌ప్రెస్ స్టాపేజీపై ద.మ.రైల్వే కీలక నిర్ణయం

తీరం దాటిన తుఫాను : ఏపీలో కుండపోతవర్షాలు ... పునరావాస కేంద్రాల్లో 75 వేల మంది

అంతర్వేదిపాలెంలో తీరాన్ని తాకిన మొంథా తుఫాను

Montha Effect: ఈ టైంలో బీచుల దగ్గర వీడియోస్ చేసుకోవడం కరెక్ట్ కాదు.. నారా లోకేష్

చంద్రబాబు గ్రేట్.. హరీష్ రావు తండ్రి పట్ల సంతాపం.. మొంథా పనులు ఒకవైపు జరుగుతున్నా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

తర్వాతి కథనం
Show comments