Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్ 2025 షెడ్యూల్ విడుదల - లీగ్ ఎప్పటి నుంచి అంటే...

Advertiesment
ipl2025

ఠాగూర్

, ఆదివారం, 16 ఫిబ్రవరి 2025 (22:06 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ 2025 మార్చి నెల నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు ఐపీఎల్ 2025 సీజన్‌‌ షెడ్యూల్ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆదివారం విడుదల చేసింది. మార్చి 22వ తేదీ నుంచి మే 25 వరకు ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. 
 
ఫిబ్రవరి 19 నుంచి ఐపీఎల్ చాంపియన్స్ ట్రోఫీ జరుగనుండగా, ఈ మెగా టోర్నీ ముగిసిన కొన్ని రోజులకే ఐపీఎల్ ప్రారంభంకానుంది. ఐపీఎల్ 2025లో మే 18తో లీగ్ దశ ముగియనుండగా, మే 20వ తేదీన క్వాలిఫయర్-1, మే 21వ తేదీన ఎలిమినేటర్ మ్యాచ్, మే 23వ తేదీ క్వాలిఫయర్-2, మే 25వ తేదీ ఫైనల్ మ్యాచ్‌ జరుగనున్నాయి. 
 
చాంపియన్స్ ట్రోఫీ - భారత్ ఆడే మ్యాచ్‌లపై కీలక నిర్ణయం!! 
 
ఈ నెల 19వ తేదీ నుంచి పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో భారత్ పాల్గొంటుంది. కానీ, భారత్ అన్ని మ్యాలను దుబాయ్‌లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో భారత్ మ్యాచ్‌లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. భారత జట్టు ఈ టోర్నీలో ఆడే మ్యాచ్‍లకు అదనపు టిక్కెట్లు విడుదల చేయాలని నిర్ణయించింది. 
 
హైబ్రిడ్ మోడల్‌లో జరుగనున్న చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు గ్రూపు-ఏలో ఉంది. భారత్ తన తొలి మ్యాచ్‌ను ఈ నెల 20వ తేదీన బంగ్లాదేశ్‌తో, 23వ తేదీన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో, మార్చి 2వ తేదీన న్యూజిలాండ్ జట్టుతో లీగ్ మ్యాచ్‌లను ఆడనుంది. ఈ మ్యాచ్‌లకు ఇప్పటికే టిక్కెట్లను విడుదల చేసిన ఐసీసీ... తాజాగా అదనపు టిక్కెట్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. టీమిండియా ఫ్యాన్స్‌కు ఇది నిజంగానే శుభవార్తే. 
 
కాగా, చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్ అన్ని మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా జరుగనుంది. ఒక వేళ భారత్ ఫైనల్ చేరితో ఫైనల్‌ మ్యాచ్ పాకిస్థాన్‌లో కాకుండా దుబాయ్‌లో జరుగనుంది. ఈ టైటిల్ మ్యాచ్ టిక్కెట్లపైనా ఐసీసీ స్పందించింది సెమీ ఫైనల్ మ్యాచ్‍‌లకు పరమితంగానే టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఫైనల్ మ్యాచ్‌కు ఇంకా టిక్కెట్లు విడుదల చేయలేదని పేర్కొంది. 
 
అలాగే, ఫైనల్ మ్యాచ్‌ జరిగేది దుబాయ్ లేదా లాహోర్ అని భారత్ గెలుపోటములపై ఆధారపడివుంటుంది. సెమీస్‌‍లో ఇండియా ఓడిపోతే ఫైనల్ మ్యాచ్ లాహోర్‌లో జరుగుతుంది. ఒకవేళ గెలిస్తే మాత్రం ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతుంది. ఆ తర్వాతే ఈ టిక్కెట్లపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చాంపియన్స్ ట్రోఫీ - భారత్ ఆడే మ్యాచ్‌లపై కీలక నిర్ణయం!!