Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL 2025: విరాట్ కోహ్లీ 1000 పరుగులు.. కేకేఆర్‌ను చిత్తుగా ఓడించిన RCB (Video)

Advertiesment
RCB

సెల్వి

, శనివారం, 22 మార్చి 2025 (23:17 IST)
RCB
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) శనివారం జరిగిన ఆరంభ మ్యాచ్‌ అరుదైన రికార్డులు నమోదైనాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ '1000 పరుగుల రికార్డును సాధించాడు. ఫలితంగా ఆర్‌ఎస్‌పిబి కేకేఆర్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఇంకా ఐపీఎల్ పసికూన కేకేఆర్ నిర్దేశించిన లక్ష్యాన్ని కేవలం 15.2 ఓవర్లలోనే ఛేదించి ఛాంపియన్‌గా నిలిచింది. 
 
శనివారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఐపీఎల్ 2025 ప్రారంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) ప్రస్తుత ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్)ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. కేకేఆర్ కేవలం 174 పరుగులకే ఆలౌటైంది. కానీ ఆర్సీబీ కేవలం 16.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.  
webdunia
RCB
 
కృనాల్ పాండ్యా (3/29), జోష్ హాజిల్‌వుడ్ (2/22) బంతితో అద్భుతంగా రాణించారు. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ తమ క్లాస్‌ ఇన్నింగ్స్‌ను ప్రదర్శించి, సూపర్ గెలుపును సాధించేందుకు అర్ధ సెంచరీలు చేశారు. కెకెఆర్ జట్టుకు కెప్టెన్ అజింక్య రహానె అర్ధ సెంచరీ మాత్రమే సానుకూల అంశంగా నిలిచింది. కోహ్లీ కూడా మెరుగ్గా రాణించడంతో బెంగళూరు సునాయాసంగా గెలుపును నమోదు చేసుకుంది. 
 
అంతకుముందు ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్‌సిబి, మొదట బ్యాటింగ్ చేసిన కెకెఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.  
webdunia
Kohli Fan
 
కెప్టెన్ అజింక్య రహానే, ఓపెనర్ సునీల్ నరైన్ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో KKR ఇన్నింగ్స్ ప్రారంభమైంది. ఇది స్కోరు బోర్డును గణనీయంగా పెంచింది. రహానే 31 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 56 పరుగులు చేశాడు. ఇంకా కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే మూడు ఫ్రాంచైజీలకు సారథిగా వ్యవహరించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. నరైన్ 26 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో సహా 44 పరుగులు చేశాడు.
ఆర్‌సిబి బౌలర్లలో కృనాల్ పాండ్యా 3 వికెట్లు, జోష్ హాజిల్‌వుడ్ 2 వికెట్లు, యష్ దయాల్, రసిక్ దార్ సలాం, సుయాష్ శర్మ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Virat Kohli Dance: షారుక్ ఖాన్‌తో కలిసి "ఝూమే జో పఠాన్" పాటకు స్టెప్పులేసిన కింగ్ కోహ్లీ (video)