Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు మూడో వన్డే మ్యాచ్ : క్లీన్‌స్వీప్‌పై టీమిండియా గురి

India
Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (09:51 IST)
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా శుక్రవారం భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఆఖరి వన్డే మ్యాచ్ జరుగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు జరిగిన రెండు వన్డేల్లో భారత్ విజయకేతనం ఎగురవేసిన విషయంతెల్సిందే. శుక్రవారం జరిగే చివరి వన్డేలోనూ గెలుపొంది 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకోవాలన్న తలంపులో ఉంది. 
 
ఈ మ్యాచ్ నామమాత్రమే కావడంతో రిజర్వ్ బెంచ్‌ ఆటగాళ్లకు అవకాశం కల్పించి, వారిని పరీక్షించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తుంది. మరోవైపు, కరోనా నుంచి కోలుకున్న స్టార్ ఆటగాడు శిఖర్ ధవాన్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడని కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించారు.
 
మరోవైపు, పర్యాటక వెస్టిండీస్ జట్టు బలంగా ఉన్నప్పటికీ బ్యాటింగ్ వైఫల్యాలు ఆ జట్టును ఎంతగానో వేధిస్తున్నాయి. ముఖ్యంగా, బ్యాటింగ్ సమస్య తీవ్రంగా ఉంది. అయినప్పటికీ ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాలన్న కసితో కరేబియన్ కుర్రోళ్లు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

తర్వాతి కథనం
Show comments