Webdunia - Bharat's app for daily news and videos

Install App

హండ్రెడ్ లీగ్ క్రికెట్ టోర్నీ: 50 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు.. అదిరే సెంచరీ

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2022 (09:25 IST)
Will Jacks
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ద హండ్రెడ్ లీగ్ క్రికెట్ టోర్నీలో బ్యాటర్లు విజృంభిస్తున్నారు. బ్యాటర్లు మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. 
 
ఈ టోర్నీలో భాగంగా రెండు రోజుల క్రితం బర్మింగ్‌హామ్‌ ఫీనిక్స్‌కు చెందిన 20 ఏళ్ల బ్యాటర్‌ విల్‌ స్మీడ్‌ 50 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో శతక్కొట్టాడు. తద్వారా ఈ లీగ్‌లో మొదటి సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
 
తాజాగా ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌కు చెందిన 23 ఏళ్ల విల్‌జాక్స్‌ ఏకంగా 47 బంతుల్లోనే మూడంకెల స్కోరు అందుకున్నాడు. మొత్తం 48 బంతుల్లో 10 ఫోర్లు, 8 భారీ సిక్సర్ల సాయంతో 108 పరుగులతో అజేయంగా నిలిచి తన జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. కాగా విల్‌స్మీడ్‌ సెంచరీ సాధించిన సథరన్‌ బ్రేవ్‌పైనే జాక్స్‌ కూడా సెంచరీ బాదడం విశేషం. 
 
ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి తొలుత సథరన్‌ బ్రేవ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు ఇన్విన్సిబుల్స్‌ సామ్‌ బిల్లింగ్స్‌. అతని నిర్ణయం కరెక్టేనని బౌలర్లు నిరూపించారు. నిర్ణీత 100 బంతుల్లో ప్రత్యర్థిని 137 పరుగులకే కట్టడి చేశారు.
 
కాగా తక్కువ స్కోరును ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇన్విన్సిబుల్స్‌కు జాక్స్‌ అదిరే ఆరంభం ఇచ్చాడు. 225 స్ట్రైక్‌ రేట్‌తో మెరుపు సెంచరీ సాధించాడు. ఫలితంగా 82 బంతుల్లోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది ఇన్విన్సిబుల్స్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్ట్‌టైమ్ ఉద్యోగం కోసం మహిళ లింక్ క్లిక్ చేసింది.. అంతే రూ. 4.72 లక్షలు స్వాహా

గంజాయి స్మగ్లింగ్.. భార్యగా నటించేందుకు మహిళను అద్దెకు తీసుకున్నాడు..

కాదంబరి వ్యవహారం: వైఎస్సార్‌సీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ అరెస్టు

సింగరేణి కార్మికులకు రూ. 1.90లక్షల బోనస్‌.. దసరా కానుక

గణేష నిమజ్జనం- మహిళల పట్ల అలా ప్రవర్తించారు.. 999 మంది అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్ 4 ఏళ్లుగా అత్యాచారం చేస్తూనే వున్నాడు: రిమాండ్ రిపోర్ట్

నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ తో కలిసి భోజనాలు, బట్టలు పంపిణీ చేసిన అక్కినేని కుటుంబం

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

తర్వాతి కథనం
Show comments