Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జోర్డాన్‌లో టాక్సిగ్ యాసిడ్ లీక్ - 12 మంది మృతి

container blast
, మంగళవారం, 28 జూన్ 2022 (15:16 IST)
జోర్డాన్ దేశంలోని అఖ్వాబా నగరంలో భారీ పేలుడు సంభవించింది. ఓ కంటైనర్‌ కిందపడటంతో ఈ పేలుడు జరిగింది. ఇందులో నుంచి టాక్సిక్ యాసిడ్ లీక్ కావడంతో కావడంతో దాన్ని పీల్చి 12 మంది చనిపోగా, 250 మంది వరకు గాయపడినట్టు సమాచారం. ఈ ప్రమాదం సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో జరుగగా, మంగళవారం వెలుగులోకి వచ్చింది. 
 
అఖ్వబా పోర్టులో ట్యాంకులను నౌకల్లో లోడింగ్ చేస్తుండగా, ప్రమాదవశాత్తు ఒక కంటైనర్ షిప్ కిందపడిపోయింది. దీంతో భారీ పేలుడు సంభవించింది. ఆ తర్వాత ముదురు పసుపు రంగులో దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. 
 
ఇది క్లోరిన్ వాయువుగా గుర్తించారు. దీన్ని పీల్చడం వల్ల 12 మంది ప్రాణాలు విడిచారు. మరో 250 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
రసాయనాన్ని నిల్వవుంచే కంటెయినర్‌ని తరలిస్తున్న సమయంలోనే క్రెయిన్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు జోర్డాన్ ప్రభుత్వం అధికారికంగా ఓ ప్రకటన చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరింతగా ముదిరిన మహారాష్ట్ర సంక్షోభం : షిండే గూటికిన 14 మంది ఎంపీలు?