Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెరిగిన అక్రమ వలసలు - ట్రక్కులో 46 మృతదేహాలు

deadbody
, మంగళవారం, 28 జూన్ 2022 (12:24 IST)
అమెరికా - మెక్సికో దేశ సరిహద్దుల్లో అక్రమవలసలు పెరిగిపోయాయి. దీంతో అనేక మంది పౌరులు అమెరికా నుంచి బ్రెజిల్‌కు, బ్రెజిల్ నుంచి అమెరికాకు వలస పోతున్నారు. ఈ క్రమంలో టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియాలో ఓ ట్రక్కులో 46 మంది వలసదారుల మృతదేహాలను అధికారులు గుర్తించారు. వీరంతా ఊపిరాడక చనిపోయినట్టు భావిస్తున్నారు. 
 
ట్రక్కు ట్రైయిలర్‌ల దాక్కుతున్న మరో 16 మందిని రక్షించి సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు శాన్ ఆంటోనియా అగ్నిమాపకదళ విభాగం వెల్లడించింది. ఈ 16 మందిని నలుగురు మైనర్లు ఉన్నట్టు తెలిపారు. ఈ మనుషుల అక్రమ రవాణాకు సంబంధించి అమెరికా పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శాన్ ఆంటోనియో నగర శివారు ప్రాంతంలో ఈ ట్రక్కును గుర్తించిన పోలీసులు అనుమానంతో దీన్ని తనిఖీ చేయగా, ఈ దిగ్భ్రాంతికర విషయం వెలుగు చూసింది. 
 
అయితే, ఈ వలసదారుల మృతికి అధిక ఉష్ణోగ్రత కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే శాన్ ఆంటోనియాలో సోమవారం రికార్డు స్థాయిలో 103 డిగ్రీలో ఫారెన్ హీట్‌ ఉష్ణోగ్రత నమోదైంది. వలసదారుల మరణానికి ఇది ఓ కారణమై వుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. గత 2017 జూలై నెలలో కూడా ఇదే విధంగా పది మంది వలసదారురు ప్రాణాలు కోల్పోయిన ఘటన కూడా కలకలంస సృష్టించిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంటర్ పరీక్షా ఫలితాలు - అమ్మాయిలదే పైచేయి...