Webdunia - Bharat's app for daily news and videos

Install App

రీల్స్‌‍పై వివాదం - టెన్నిస్ క్రీడాకారిణిని కాల్చి చంపిన తండ్రి

ఠాగూర్
శుక్రవారం, 11 జులై 2025 (09:05 IST)
హెటెక్ సమాజంలో యువతకు రీల్స్ మోజు ఎక్కువైంది. అనేక మంది రీల్స్ మోజులో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొన్ని సందర్భాల్లో ఈ రీల్స్ తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. తాజాగా రీల్స్ వ్యసనం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడంపై తలెత్తిన వివాదం చివరకు ఒక తండ్రి తన కన్న కూతురినే తుపాకీతో కాల్చి చంపేంత దారుణానికి దారితీసింది. ఈ అత్యంత విషాదకర ఘటన గురుగ్రామ్‌లో గురువారం జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గురుగ్రామ్‌లోని సెక్టార్-57, సుశాంత్ లోక్ ఫేజ్-2లో నివసిస్తున్న 25 ఏళ్ల రాధికా యాదవు ఆమె తండ్రే కాల్చి చంపాడు. రాధిక రాష్ట్రస్థాయి టెన్నిస్ క్రీడాకారిణిగా పలు పోటీల్లో విజయం సాధించింది. అయితే, ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌‍ రీల్స్ చేసే వ్యసనం ఉందని, ఈ విషయంలో తండ్రితో తరచూ గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
 
గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఇదే విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన తండ్రి తన వద్ద ఉన్న తుపాకీతో రాధికపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మూడు బుల్లెట్లు ఆమె శరీరంలోకి దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది.
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. తండ్రిని అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

తర్వాతి కథనం
Show comments