Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థానీ నటి హుమైరా అస్కర్ అలీ అనుమానాస్పద మృతి

Advertiesment
Humaira Asghar Ali

ఠాగూర్

, బుధవారం, 9 జులై 2025 (17:05 IST)
పాకిస్థాన్‌‍కు చెందిన ప్రముఖ నటి, మోడల్ హుమైరా అస్కర్ అలీ (30) అనుమానాస్పదస్థిలో మృతి చెందారు. అమె కరాచీలోని డిఫెన్స్ ఏరియాలో నివసిస్తున్న ఫ్లాట్‌లో విగతజీవిగా పడివున్నారు. వివరాల్లోకి వెళితో హుమైరా అస్కర్ గత కొన్నేళ్లుగా ఒంటరిగా నివసిస్తున్నారు. అయితే, గత మూడు వారాలుగా ఆమె ఎవరికీ కనిపించలేదు. ఈ క్రమంలోనే ఆమె ఫ్లాట్ నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. 
 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పలుమార్లు తలుపు తట్టినా లోపలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించగా, హుమైరా మృతదేహం కుళ్లినస్థిలో కనిపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమికంగా ఎలాంటి అనుమానాలు లేవని, దీనిని సహజ మరణంగా భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక మృతికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని వివరించారు. హుమైరా అస్కర్ అలీ తుమాషా ఘర్ అలే రియాలిటీ టీవీ సిరీస్‍‌తో పాటు జలైబీ చిత్రంలో నటించి పాకిస్థాన్‌‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Sirisha: సుడిగాలి సుధీర్ పెళ్లిచేసుకోడు : ధనరాజ్ భార్య శిరీష స్టేట్ మెంట్