భారత ఆర్మీతో కలిసి స్టెప్పులేసిన టీమిండియా.. సంబరాల్లో సభ్యులు

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (10:07 IST)
ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ విజయాన్ని సొంతం చేసుకున్న భారత క్రికెట్ జట్టు సభ్యులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సిరీస్ విజయాన్ని ఆటగాళ్లు ఘనంగా జరుపుకున్నారు. సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా డ్రా అయినట్టు అంపైర్లు ప్రకటించారు. దీంతో భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచింది. 
 
అంపైర్ల ప్రకటన తర్వాత మైదానంలోకి వచ్చిన భారత ఆటగాళ్లు మైదానంలో నృత్యాలు చేశారు. తర్వాత భారత ఆర్మీతో కలిసి సంబరాలు చేసుకున్నారు. తొలుత మైదానంలో పుజారా నడిచే విధానాన్ని అనుకరిస్తూ పుజారా డ్యాన్స్‌ను జట్టు సభ్యులతో రిషబ్ పంత్ చేయించాడు. 
 
నిజానికి పుజారా నడిచేటపుడు చేతులు కదపడు. దాంతో ఆటగాళ్లందరూ జాగింగ్ చేస్తున్నట్టుగా కాళ్లను వేగంగా ఊపుతూ చేతులను స్థిరంగా ఉంచేలా ఆటగాళ్ళతో రిషబ్ స్టెప్పులు వేయించాడు. కానీ, పుజారా మాత్రం సులపైన స్టెప్పులు వేయడంలోనూ ఇబ్బందిపడ్డాడు. 
 
ఆ తర్వాత హోటల్ గదికి వెళ్లిన టీమిండియా సభ్యులు అక్కడ కూడా చిందులు వేస్తూ సంబరాల్లో మునిగిపోయారు. మేరే దేశ్ కీ ధర్తీ పాటకు కెప్టెన్ కోహ్లీతో పాటు.. మిగతా క్రికెటర్లు స్టెప్పులేశారు. ఇక్కడ జరిగిన సంబరాల్లో భారత ఆర్మీ కూడా పాల్గొంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ నాణ్యతను పరీక్షించిన ట్రాయ్

ఫెయిల్ అయితే భారతరత్న అబ్దుల్ కలాంను గుర్తు తెచ్చుకోండి: చాగంటివారి అద్భుత సందేశం (video)

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

భర్త చిత్రహింసలు భరించలేక పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్యలు... ఎక్కడ?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం- వరద నీటి తొలగింపుకు రూ.27 కోట్లు కేటాయింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments