Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిడ్నీ క్రికెట్ స్టేడియంలో అనుష్కతో కోహ్లీ.. ఇదే నా బెస్ట్ అచీవ్‌మెంట్

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (13:18 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా - భారత్ క్రికెట్ చరిత్రలో 72 యేళ్ల టీమిండియా కలను సాకారం చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై 2-1 తేడాతో టెస్ట్ సిరీస్‌ను తన కెప్టెన్సీలో కైవసం చేసుకున్నాడు. ఈ మధురక్షణాలను కోహ్లీ తన భార్య, సినీ నటి అనుష్క శర్మతో కలిసి ఆస్వాదించాడు. 
 
వర్షం కారణంగా మ్యాచ్ డ్రా అయినట్టు అంపైర్లు ప్రకటించిన వెంటనే టీమిండియా జట్టు మైదానంలోకి వచ్చింది. వారితో పాటు కోహ్లీ తనతో పాటు తన సతీమణిని కూడా మైదానంలోకి తీసుకొచ్చి, స్టేడియం మొత్తం కలియతిరుగుతూ సందడి చేశారు. అనుష్క భుజాలపై కోహ్లీ రెండు చేతులు వేసి స్టేడియంలో నడుచుకుంటూ కెమెరాలకు చిక్కాడు.
 
ఈ విజయంపై కోహ్లీ స్పందిస్తూ, ఈ విజయం తన జీవితంలో బెస్ట్ అచీవ్‌మెంట్ అంటూ పేర్కొన్నాడు. కాగా, ఈ పర్యటనలో కోహ్లీ ఒక సెంచరీతో పాటు 282 పరుగులు చేసిన విషయం తెల్సిందే. భారత క్రికెట్ జట్టును చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. ఇదివరకు ఎపుడూ ఇలాంటి మూమెంట్‌ను చూడలేదు. టీమిండియాను లీడ్ చేస్తూ ఇలాంటి చారిత్రక విజయం సాధించడం గౌరవంగా భావిస్తున్నా. ఈ క్షణాలను తప్పకుండా మేం ఎంజాయ్ చేస్తాం అంటూ కోహ్లీ వ్యాఖ్యానించాడు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments