Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్!?

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (17:26 IST)
వచ్చే సెప్టెంబరులో భారత్ వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ క్రికెట్ కప్ పోటీలు జరగాల్సివుంది. అయితే, ప్రస్తుతం భారత్‌లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తికి అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. పాజిటివ్ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. ఇదిలావుంటే, ప్రస్తుతం ఐపీఎల్ 14వ సీజన్ పోటీలు జరుగుతున్నాయి. క‌ఠిన‌మైన బ‌యోబ‌బుల్ ఏర్పాటు చేసి క‌రోనా సెకండ్ వేవ్ స‌మ‌యంలోనూ ఐపీఎల్‌ను న‌డిపిస్తున్నారు. 
 
దీనిపై ఇప్ప‌టికే కొన్ని వ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉన్నాయి. కొంద‌రు ప్లేయ‌ర్స్‌, అంపైర్లు ఇప్ప‌టికే లీగ్‌ను వ‌దిలి వెళ్లిపోయారు. కానీ బీసీసీఐ మాత్రం ఎలాగోలా టోర్నీని కొన‌సాగిస్తోంది. అయితే క‌రోనా సెకండ్ వేవ్ ఇలాగే ఉంటే మాత్రం రానున్న రోజుల్లో భారత‌దేశంలో జ‌ర‌గాల్సిన పెద్ద టోర్నీలు వెళ్లిపోయే ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.
 
ముఖ్యంగా అక్టోబ‌రు ‌- న‌వంబ‌రులో జ‌ర‌గాల్సిన టీ20 వ‌రల్డ్‌క‌ప్ ఇండియా జ‌ర‌గ‌డం అనుమానంగానే ఉంది. ఇప్ప‌టికే ప‌లు దేశాలు ఇండియా నుంచి వ‌చ్చివెళ్లే విమానాల‌పై నిషేధం విధించ‌డం, ప్ర‌యాణాల‌పై ఉన్న ఆంక్ష‌ల నేప‌థ్యంలో టోర్నీని ఇండియాలో కాకుండా యూఏఈలో నిర్వ‌హించే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.
 
తాజాగా బీసీసీఐ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌, టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ డైరెక్ట‌ర్ ధీర‌జ్ మల్హోత్రా కూడా ఈ విష‌యాన్ని ధృవీక‌రించారు. ఏం జ‌రుగుతుందో ఇప్పుడే చెప్ప‌లేం. కానీ అత్య‌వ‌స‌ర ప్ర‌ణాళిక ప్ర‌కారం టోర్నీ యూఏఈలో జ‌రుగుతుంది. అయితే ఆతిథ్య హ‌క్కులు మాత్రం బీసీసీఐ ద‌గ్గ‌రే ఉంటాయి అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 
 
టోర్నీ నిర్వ‌హించేది బీసీసీఐ అయిన‌ప్ప‌టికీ ఓ అద్భుత‌మైన అవ‌కాశాన్ని ఇండియా కోల్పోతుంది. ఇప్ప‌టికే ఈ టోర్నీ కోసం హైద‌రాబాద్‌తోపాటు ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌క‌తా, బెంగ‌ళూరు, ధ‌ర్మ‌శాల‌, అహ్మ‌దాబాద్, లక్నోల‌ను ఎంపిక చేసింది. కానీ, కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి ప్రభావం తగ్గకపోతే మాత్రం ఈ టోర్నీ దుబాయ్ వేదికగా జరిగే అవకాశంవుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

తర్వాతి కథనం
Show comments