బాగా ఆడుతున్నా జట్టు నుంచి తప్పిస్తున్నారు: సురేష్ రైనా

తాను బాగా ఆడుతున్నప్పటికీ జట్టు నుంచి తప్పిస్తున్నారంటూ సీనియర్ క్రికెటర్ సురేష్ రైనా ఆరోపించారు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది.

Webdunia
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (12:07 IST)
తాను బాగా ఆడుతున్నప్పటికీ జట్టు నుంచి తప్పిస్తున్నారంటూ సీనియర్ క్రికెటర్ సురేష్ రైనా ఆరోపించారు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్ ముగియగా, శుక్రవారం జరిగే చివరి వన్డే మ్యాచ్‌తో ఆరు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ముగియనుంది. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్ ఆరంభంకానుంది. ఇందులో సురేష్ రైనా సభ్యుడిగా ఉన్నాడు. 
 
ఈ సందర్భంగా సురేష్ రైనా స్పందిస్తూ, టీమిండియా తరపున తాను బాగా ఆడినప్పటికీ జట్టు నుంచి తప్పించడం బాధించిందన్నాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో తానేంటో నిరూపించుకునే సమయం వచ్చిందని ఆ అవకాశాన్ని చేజార్చుకోనని రైనా అన్నాడు. తాను బాగా రాణించినప్పటికీ తనను జట్టు నుంచి తొలగించడం బాధ కలిగించిందన్నాడు. 
 
ఇప్పుడు తాను యో-యో టెస్టు పాసయ్యానన్నారు. ఇప్పుడెంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నానని.. ఇన్ని నెలల కఠోర శిక్షణ తర్వాత మళ్లీ భారత జట్టుకు ఆడాలనే కాంక్ష మరింత బలపడిందన్నాడు. దీన్ని ఇక్కడే వదిలిపెట్టనని.. వీలైనన్ని ఎక్కువ రోజులు భారత్‌కు ఆడాలనేదే తన లక్ష్యమన్నాడు. ఇకపోతే, 2019 ప్రపంచకప్‌లో ఆడాలనుకుంటున్నానని తెలిపిన రైనా.. ఇంగ్లాండ్‌లో బాగా రాణిస్తానని తెలుసన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. ప్రధాని దిగ్భ్రాంతి.. మృతులకు రూ.2లక్షల నష్ట పరిహారం

శ్రీకాకుళం కాశిబుగ్గ వెంకన్న ఆలయంలో తొక్కిసలాట.. తొమ్మిది మంది మృతి (video)

బాసరలో తల లేని నగ్నంగా ఉన్న మహిళ మృతదేహం.. స్థానికులు షాక్

Telangana Speaker: ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం- సుప్రీంకోర్టు గడువు ముగింపు

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ద్విచక్ర వాహనంపై హోంమంత్రి అనిత పరిశీలన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9- బిగ్ బాస్ తెలుగు 9 : ఈ వారం ఎలిమినేషన్ వుండదా?

Prabhas: యుద్దం నేపథ్యంలో శంబాల ట్రైలర్‌.. ఆవిష్కరించిన ప్రభాస్

Allari Naresh: ప్రేమ, థ్రిల్ ఎలిమెంట్స్ తో అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ

Bhagyashree Borse: నక్షత్రాల మధ్య ఆటలాడుతూ, వెన్నెల్లో తేలియాడుతూ.. రామ్, భాగ్యశ్రీ బోర్సే

Mass Jatara Review: జరుగుతున్న కథతో ఫ్యాన్స్ ఫార్ములాగా మాస్ జాతర - మూవీ రివ్యూ

తర్వాతి కథనం
Show comments