Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభమన్ గిల్ కొత్త రికార్డు.. అత్యంత పిన్న వయస్సులో అర్థసెంచరీతో..!

Webdunia
బుధవారం, 20 జనవరి 2021 (10:15 IST)
ఆసీస్ గడ్డపై టీమిండియా యువ క్రికెటర్లు రికార్డుల పంట పండిస్తున్నారు. తాజాగా యువ ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌ మరో అరుదైన రికార్డును తన పేరిట రాసుకున్నాడు. బ్రిస్బేన్‌ టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో 9 పరుగుల తేడాతో సెంచరీ మిస్‌ అయినా.. 50 ఏళ్ల కిందటి ఓ రికార్డును గిల్‌ తిరగరాశాడు. ఓ టెస్ట్‌ మ్యాచ్‌ నాలుగో ఇన్నింగ్స్‌లో అర్ధశతకం చేసిన అత్యంత పిన్న వయసు కలిగిన టీమిండియా ఓపెనర్‌గా గిల్‌ రికార్డు సృష్టించాడు. 
 
గిల్‌ ప్రస్తుత వయసు 21 ఏళ్ల 134 (20వ తేది నాటికి) రోజులు. గతంలో నాలుగో ఇన్నింగ్స్‌లో అర్ధశతకం చేసిన అత్యంత పిన్న వయసు రికార్డు టీమిండియా లెజెండరీ బ్యాట్స్‌మన్‌ సునీల్‌ గవాస్కర్‌ (21 ఏళ్ల 243 రోజులు) పేరిట ఉంది.
 
సన్నీ 1970-71లో వెస్టిండీస్‌పై పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ టెస్ట్‌ నాలుగో ఇన్నింగ్స్‌లో 67 పరుగులు చేశాడు. సన్నీ ఇదే సిరీస్‌లో అరంగేట్రం చేశారు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లోనే శుభమన్‌ గిల్‌ టెస్ట్‌ అరంగేట్రం చేశాడు. మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో 45, 35 పరుగులు చేసిన గిల్‌..
 
సిడ్నీలో అర్ధశతకం చేశాడు. మూడో టెస్టు ఆడుతున్న గిల్‌ని భయపెట్టేందుకు ఆసీస్‌ స్టార్‌ పేసర్లు మిచెల్‌ స్టార్క్‌, పాట్‌ కమిన్స్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌ గంటకు సుమారు 140 కి.మీ పైగా వేగంతో పదేపదే షార్ట్‌ పిచ్‌ బంతుల్ని సంధించారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని గిల్‌.. షార్ట్‌ పిచ్‌ బంతులకి తనదైన శైలిలో బదులిచ్చాడు. ఈ క్రమంలోనే స్టార్క్‌ బౌలింగ్‌లో అతను కొట్టిన ప్లాట్‌ సిక్స్‌ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రమాదం ఘంటికలు మోగిస్తున్న గులియన్ బారీ సిండ్రోమ్... ఈ లక్షణాలు వుంటే సీబీఎస్

మనీలాండరింగ్ కేసులో మారిషస్ మాజీ ప్రధాని అరెస్టు

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో వజ్రాలు పొదిగివున్న నెక్లెస్ స్వాధీనం...

ఊగిపోయిన ఢిల్లీ రైల్వే స్టేషన్.. వణికిపోయిన ప్రయాణికులు.. ఎందుకంటే..

Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. కొన్ని సెకన్లు మాత్రమే.. అయినా భయం భయం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

తర్వాతి కథనం
Show comments