Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టెస్టు సిరీస్.. 1-1తో సమవుజ్జీవులుగా భారత్-ఆస్ట్రేలియా.. మూడో టెస్టు డ్రా

Advertiesment
Live Cricket Score
, సోమవారం, 11 జనవరి 2021 (13:39 IST)
India_Australia
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల్లో ఒక్కో జట్టు ఒక్కో విజయం సాధించాయి. ఇక తాజాగా జరిగిన మూడో మ్యాచ్ మాత్రం ఫలితం తేలకుండా డ్రా గా ముగిసింది.

అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 338కి ఆలౌట్ అయ్యింది. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్ 244లకే కుప్పకూలిపోయింది. ఇక మళ్ళీ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 312 పరుగులు చేసిన ఆసీస్ డిక్లైర్ ఇవ్వడంతో భారత్ ముందు 406 పరుగుల లక్ష్యం ఉంది.
 
ఇకపోతే, ఆదివారం మూడో సెషన్‌లో భాగంగా లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆడటం ఆరంభించిన భారత్.. ఆట ముగిసే సమయానికి 98 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. కానీ సోమవారం ఆట ప్రారంభమైన కాసేపటికే కాసేపటికే కెప్టెన్ రహానే(4) పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. కానీ ఆ తర్వాత వచ్చిన బ్యాటింగ్ కు వచ్చిన పంత్ అలాగే పుజారా నిలకడగా రాణిస్తూ అర్ధశతకాలు బాదడంతో భారత్ పటిష్టమైన స్థితిలో నిలిచింది.
 
కానీ వీరు ఔట్ అయిన తర్వాత బ్యాటింగ్ కొనసాగించిన అశ్విన్, విహారి తమ తర్వాత బ్యాటింగ్ చేయగల ఆటగాడు ఎవరు లేకపోవడంతో నెమ్మదిగా వికెట్లు పడకుండా జాగ్రత్తగా ఆడుతూ మ్యాచ్‌ను డ్రా వైపుకు నడిపించారు. అయితే నాలుగు టెస్టుల ఈ సిరీస్‌లో ప్రస్తుతం 1-1తో సమానంగా ఉన్నాయి భారత్, ఆసీస్. ఇక మిగిలిన చివరి టెస్ట్‌లో ఎవరు విజయం సాధిస్తే... సిరీస్ వారిదే అవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రతి భారతీయుడు హృదయం గర్వంతో ఉప్పొంగి పోయేలా చేశారు : అమితాబ్