Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్కంఠ పోరులో పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చిన శ్రేయాస్ అయ్యర్

ఠాగూర్
సోమవారం, 2 జూన్ 2025 (09:22 IST)
ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన ఉత్కంఠ ఫోరులో పంజాబ్ కింగ్స్ జట్టు ఫైనల్‌కు చేరింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)ల జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. ఈ ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్ జట్టును పంజాబ్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రాణించి, జట్టును ఫైనల్‌కు చేర్చాడు. దీంతో మంగళవారం నాడు ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుతో తలపడనుంది. 
 
వర్షం కారణంగా దాదాపు మూడు గంటల ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు నిర్దేశించిన విజయలక్ష్యాన్ని పంజాబ్ జట్టు 19 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 204 పరుగులు చేసింది. ఇందులో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 41 బంతుల్లో 87 పరుగులు చేసి, కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తోడు మరో స్టార్ బ్యాటర్ నేఫాల్ వధేరా (48), జోష్ ఇంగ్లిస్ (38)లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 
 
అంతకుముందు ముంబై ఇండియన్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసి, ప్రత్యర్థి జట్టు ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచింది. ముంబై జట్టులోని హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చి మెరుపులు మెరిపించాడు. అలాగే, ఆ జట్టులో సూర్యకుమార్ యాదవ్ 44, జానీ బెయిర్ స్టో 24, నమన్ ధీర్ 37 చొప్పున పరుగులు చేశారు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన పంజాబ్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని పంజాబ్ జట్టు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ ఆ తర్వాత పట్టు కోల్పోయారు. గత మ్యాచ్‌లో అర్థ శతకంతో రాణించిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. స్టోయినిస్ వేసిన మూడో ఓవర్‌లో విజయకుమార్‌కు క్యాచ్ ఇచ్చి తన వ్యక్తిగత స్కోరు 8 వద్ద వికెట్‌ను చేజార్చుకున్నాడు. సాధారణంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానంలో వచ్చే తిలక్ వర్మ ఈ మ్యాచ్‌లో వ్యూహం మార్చి ముందుకు వచ్చాడు. బెయిర్ స్టోతో కలిసి జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. జట్టులోని బౌలర్లంతా సమిష్టింగా రాణించడంతో 20 ఓవర్లలో 203 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత 204 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు 19 ఓవర్లలోనే ఉత్కంఠభరితంగా విజయం సాధించింది. ప్రభ్ సిమ్రన్ 6, ప్రియాన్ష్ 20, ఇంగ్లిస్ 38, శ్రేయాస్ అయ్ర్ 87, నేహాల్ వధేరా 48 చొప్పున పరుగులు చేయడంతో విజయం సాధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

తర్వాతి కథనం
Show comments