ఐపీఎల్ 2025 పోటీల్లో భాగంగా, పంజాబ్ కింగ్స్ జట్టు తన లీగ్ దశ మ్యాచ్‌లను విజయవంతంగా పూర్తి చేసింది. సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన తన చివరి లీగ్ మ్యాచ్‌లోనూ విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో పంజాబ్ జట్టు క్వాలిఫయర్-1 ఆడేందుకు అర్హత సాధించింది.
ఆ తర్వాత 185 పరుగుల విజయలక్ష్యంతో 18.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి పంజాబ్ జట్టు గెలుపొందింది. ఆ జట్టులో ప్రియాంశ్ ఆర్య 62, జోష్ ఇంగ్లిస్ 73 చొప్పున పరుగులు చేశారు. శ్రేయాస్ అయ్యర్ 26, ప్రభ్‌సిమ్రన్ 13 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో శాంట్నర్ 2, జస్పీత్ బుమ్రా ఒక వికెట్ పడగొట్టారు. ఈ ఓటమితో నాలుగో స్థానానికి పరిమితమైన ముంబై .. గుజరాత్ టైటాన్స్ లేదా ఆర్బీసీతో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది.
మంగళవారం లక్నోతో జరిగే మ్యాచ్‍లో ఆర్సీబీ గెలిస్తే 19 పాయింట్లతో టాప్-2లో నిలుస్తుంది. అపుడు గుజరాత్ - ముంబై జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది.
ఇకపోతే పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టులో సూర్యకుమార్ యాదవ్ 57 పరుగులతో రాణించగా, ఓపెనర్లు రికెల్ టన్ 27, రోహిత్ శర్మ 24, హార్దిక్ పాండ్యా 26, సమన్ ధీర్ 20, విల్ జాక్స్ 17, తిలక్ వర్మ 1 చొప్పున పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో మార్కో యాన్సెస్ 2, అర్ష్‌దీప్ సింగ్ 2, విజయ్ కుమార్ వైశాఖ్ 2, హర్‍ప్రీత్ బ్రార్ ఒక వికెట్ పడగొట్టారు.