Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెహ్వాగ్ తలజుట్టు కంటే నా వద్ద డబ్బెక్కువ వుంది.. అక్తర్ సెటైర్లు

Webdunia
శుక్రవారం, 24 జనవరి 2020 (12:17 IST)
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా వుండే వీరేంద్ర సెహ్వాగ్ సెటైర్లు వేయడంలో కింగ్. ట్విట్టర్లో చమత్కారవంతమైన ట్వీట్ చేయడంలో దిట్ట. అలాంటి వ్యక్తి నిన్నటికి నిన్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. 
 
ప్రస్తుతం పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సెహ్వాగ్‌పై సెటైర్లు విసురుతూ ఓ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. సెహ్వాగ్ తల జుట్టుకంటే తన వద్ద అధికంగా ధనం వుందని సెటైర్లు విసురుతూ ఓ వీడియోను పోస్టు చేశాడు. మూడేళ్ల క్రితం వీరేంద్ర సెహ్వాగ్.. షోయబ్ అక్తర్‌ను ఏకిపారేస్తూ కామెంట్లు చేశాడు. షోయబ్‌కు ధనం కావాల్సి వుండటంతోనే భారత్‌పై ప్రశంసలు కురిపిస్తున్నాడని ఎద్దేవా చేశాడు. 
 
ఈ కామెంట్లకు బదులిచ్చిన అక్తర్ తాజాగా ఓ వీడియోను పోస్టు చేశాడు. మిత్రుడు సెహ్వాగ్ తలజుట్టు కంటే తన వద్ద అధిక మొత్తం ధనం వుందని సెటైర్లు విసిరాడు. ఈ వీడియో ద్వారా సెహ్వాగ్ తలలో జుట్టులేదనే విషయాన్ని ఎద్దేవా చేశాడు. అయితే ఈ సెటైర్‌ను కామెడీగా తీసుకోవాలని సూచించాడు అక్తర్. మరి ఈ వీడియోను సెహ్వాగ్ లైట్‌గా తీసుకుంటాడో లేదో తెలియాలంటే వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లైంగిక సమ్మతికి 18 యేళ్లు నిండాల్సిందే : కేంద్రం స్పష్టీకరణ

నిండు ప్రాణం తీసిన స్కూటర్ పార్కింగ్ గొడవ - మృతుడు హీరోయిన్ కజిన్

EAGLE: డ్రగ్స్ తీసుకున్న 32 మంది విద్యార్థులు.. వీరు మెడికల్ కాలేజీ విద్యార్థులు తెలుసా?

అందరూ చూస్తుండగానే కూర్చున్న చోటే గుండెపోటుతో న్యాయవాది మృతి (video)

జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ జ్యుడీషియల్ సభ్యుడిగా వేమిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించిన భారత ప్రభుత్వం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

తర్వాతి కథనం
Show comments