Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ కప్ : యువరాజ్ రికార్డును బద్ధలుకొట్టిన బంగ్లా బౌలర్

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (11:43 IST)
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌ పోటీల్లో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డు ఒకటి కనుమరుగైంది. ఈ రికార్డును బంగ్లాదేశ్ యువ బౌలర్ చెరిపేశాడు. ఈ రికార్డు ఎనిమిదేళ్ళ క్రితం యువరాజ్ సింగ్ నెలకొల్పగా, దాన్ని బంగ్లా బౌలర్ షకీబుల్ హాసన్ అధికమించాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గత 201లో జరిగిన ప్రపంచ కప్ పోటీల్లో ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఒకే మ్యాచ్‌లో 50 పరుగులు చేయడమే కాకుండా, ఏకంగా ఐదు వికెట్లు తీశాడు. ఇలాంటి అరుదైన ఫీట్‌ను ఏ ఒక్క బౌలర్ లేదా ఆల్‌రౌండర్‌ వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లలో ఇప్పటివరకు అందుకోలేదు. 
 
ఇపుడు బంగ్లా బౌలర్ షకీబుల్ హాసన్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, సోమవారం ఆప్ఘనిస్థాన్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో బంగ్లా బౌలర్ షకీబుల్ హాసన్ తొలుత బ్యాట్‌తో రాణించి 69 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఆ తర్వాత బంతితోనూ సత్తాచాటాడు. మొత్తం పది ఓవర్లు వేసిన హాసన్... 29 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు నేలకూల్చాడు.  

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments