Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్క్వైర్ కట్ షాట్స్ ఆడేవాడ్ని... ఇపుడు హెయిర్ కట్ చేసుకుంటున్నా...

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2020 (14:54 IST)
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇపుడు ఇంట్లో జుత్తు కత్తిరించుకుంటున్నాడు. కరోనా వైరస్ దెబ్బకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. దీంతో ప్రతి ఒక్క సెలెబ్రిటీ తమ ఇంటికే పరిమితమయ్యాడు. అయితే, లాక్ డౌన్ కారణంగా అన్ని సేవలు బంద్ అయ్యాయి. అయినప్పటికీ ఎలాగోలా సర్దుకుని పోతున్నారు. కానీ, ఒక్క హెయిర్ కంటింగ్‌కు మాత్రం ప్రతి ఒక్కరూ శక్తిమేరకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఒక్క విషయంలో పలువురు సక్సెస్ అవుతుంటే, మరికొందరు విఫలమవున్నారు. ఇపుడు హెయిర్ కటింగ్‌లో సచిన్ కూడా నిమగ్నమయ్యాడు. 
 
2013లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ నుంచి తప్పుకున్న సచిన్... ఇపుడు హెయిర్ కటింగ్ చేసుకుని సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, ఓ కామెంట్ చేశాడు. స్క్వైర్ కట్స్ ఆడటం నుంచి ఇపుడు హెయిర్ కట్ వరకు చేసుకుంటున్నా. అయితే, ఎపుడు కొత్త పనిని చేసినా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఆనందించినట్టు అందులో పేర్కొన్నాడు. 
 
పైగా, కొత్త హెయిర్ స్టైల్ ఎలా ఉందో చెప్పాలని అభిమానులకు ఓ ప్రశ్న సంధించాడు. కాగా, సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే సచిన్... కరోనా వైరస్ గురించి ఎన్నో అవగాహనా ట్వీట్స్‌తో పాటు.. వీడియోలను చేసి పోస్ట్ చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

తర్వాతి కథనం
Show comments