రోహిత్ శర్మ సెంచరీ రికార్డ్.. అంపైర్‌తో హిట్ మ్యాన్ టాక్..

సెల్వి
బుధవారం, 17 జనవరి 2024 (23:04 IST)
బెంగళూరు చిన్నసామి మైదానంలో జరిగే 3-వ టి20 క్రికెట్ మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్‌కు భారత జట్టు 213 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. 
 
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 69 బంతుల్లో 11 బౌండరీలు 8 సిక్సర్లులతో 121 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్ శర్మకు ఇది ఐదో సెంచరీ. ఇంకా పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ ఐదవ స్థానంలో నిలిచాడు. అలాగే రోహిత్ శర్మ టీ20ల్లో ఐదేళ్ల తర్వాత శతకం సాధించాడు.
 
ఇకపోతే.. భారత్ -ఆప్ఘన్‌ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, అంపైర్ వీరేందర్ శర్మ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. అంపైర్‌ను ఉద్దేశించి రోహిత్ శర్మ చేసిన కామెంట్స్ స్టంప్ మైక్‌లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 
 
ఫరీద్ అహ్మద్ మాలీక్ వేసిన తొలి ఓవర్‌ రెండో బంతి రోహిత్ శర్మ బ్యాట్‌ను తాకి బౌండరీకి వెళ్లింది. అయితే అంపైర్ వీరేందర్ శర్మ లెగ్‌బై‌స్‌గా ప్రకటించాడు. దీంతో నవ్వుతూ అంపైర్‌ను రోహిత్ శర్మ నిలదీశాడు. అంపైర్ కూడా నవ్వుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మనీ గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తే సెలెబ్రిటీలకు రెండేళ్ల జైలు ఖాయం

ఇదేదో పేర్ని నాని చెప్పినట్లు కనబడుతోందే (video)

DK Aruna: తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా: డీకే అరుణ

Hyderabad: ఈ-ఆటో పార్కింగ్ పొరపాటు.. ఎనిమిదేళ్ల బాలుడు మృతి.. ఎలా?

ఆటోలో డిప్యూటీ సీఎం పవన్: మీతో ఇలా పక్కన కూర్చుని ప్రయాణం అస్సలు ఊహించలేదు సార్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

Rashmika: ప్రేమికులుగా మనం ఎంతవరకు కరెక్ట్ ? అంటున్న రశ్మిక మందన్న

తర్వాతి కథనం
Show comments