#INDvsNZ 3rd T20- రోహిత్ శర్మ అదుర్స్..

Webdunia
బుధవారం, 29 జనవరి 2020 (16:31 IST)
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ-20లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 23 బంతులలో అర్థ శతకం పూర్తిచేసుకున్నాడు. టీ-20ల్లో గత పది ఇన్నింగ్స్‌ల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైన రోహిత్ ఈ మ్యాచ్‌లో చెలరేగి ఆడుతున్నాడు. 
 
బెన్నెట్ బౌలింగ్‌లో రోహిత్ వరుసగా 6,6,4,4,6 పరుగులతో రెచ్చిపోయాడు. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా మూడో టీ-20 మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుతో తలపడుతోంది. హామిల్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. 
 
చెలరేగిన రోహిత్- న్యూజిలాండ్ టార్గెట్ 180
న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టీ20లో రోహిత్ శర్మ చెలరేగాడు. 40 బంతుల్లో(3 సిక్సులు,6 ఫోర్లు) 65 రన్స్‌తో విజృంభించాడు. ఇంకా ఈ మ్యాచ్‌లో 65 పరుగులు సాధించడం ద్వారా రోహిత్ శర్మ అన్నీ ఫార్మాట్లలో 10000 పరుగులు సాధించిన భారత బ్యాట్స్‌మెన్‌‍గా రికార్డు సాధించాడు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. న్యూజిలాండ్ కు 180 పరుగుల టార్గెట్ ఫిక్స్ చేసింది.
 
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్‍‌కు మంచి ఓపెనింగ్ దక్కింది. రోహిత్ శర్మ 65 రన్స్ తో చెలరేగగా మరో ఓపెనర్ రాహుల్ 27 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. తర్వాత వచ్చిన శివమ్ ధూబె 3,వీరాట్ కోహ్లీ 38,శ్రేయాస్ అయ్యార్ 17, మనీష్ పాండే 14(నాటౌట్) ,జడేజా 10(నాటౌట్) చేశారు. దీంతో టీమిండియా 179 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో బెన్నెట్ కు మూడు వికెట్లు, మిచ్చెల్ సన్టర్, గ్రండోమకు తలో ఒక వికెట్ పడ్డాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హామీ ఇచ్చిన గంటల వ్యవధిలో నెరవేర్చిన పవన్.. రూ.6.2 కోట్ల నిధులు మంజూరు

భార్యను హత్య చేసి స్టేటస్ పెట్టాడు.. ఆపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..

ఇలాంటి కుర్రోళ్లకు తగిన గుణపాఠం నేర్పాలి.. జైలులో కొద్ది రోజులు ఉంచాల్సిందే... సుప్రీంకోర్టు

పొరుగింటి పిల్లాడితో గొడవపడుతున్న కొడుకు.. తలను రోడ్డుకేసి కొట్టిన సవతి తండ్రి...

నోయిడా ఎక్స్‌ప్రెస్ హైవేపై బీభత్సం.. పదుల సంఖ్యలో వాహనాల ఢీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. ఈ షో విజేత ఎవరంటే?

Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

తర్వాతి కథనం
Show comments