Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ప్రపంచ కప్ : భారీ లక్ష్యాన్ని ఛేదించి శ్రీలంకను చిత్తు చేసిన పాకిస్థాన్

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2023 (08:54 IST)
భారత్‌లో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, మంగళవారం పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య కీలక పోరు జరిగింది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 345 పరుగుల భారీ స్కోరు చేయగా, ఈ లక్ష్యాన్ని పాకిస్థాన్ జట్టు ఛేదించి ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ప్రపంచంలో అత్యధిక పరుగులను ఛేదించిన తొలి జట్టుగా పాకిస్థాన్ నిలిచింది. ఇప్పటివరకు ఇంగ్లండ్ పేరిట ఉన్న ఈ రికార్డును పాక్ కుర్రోళ్లు చెరిపేశారు. 
 
హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ 77 బంతుల్లో 122 పరుగులు  చేయగా, సమరవిక్రమ 89బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 108 పరుగులు చేశారు. వీరిద్దరి బ్యాటింగ్ దెబ్బకు పాకిస్థాన్ బౌలింగ్ డీలాపడిపోయింది. మిగిలిన లంక ఆటగాళ్లలో పత్తుమ్ నిస్సాంక 51, ధనంజయ డిసిల్వా 25 చొప్పున పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో హాసన్ అలీకి 4, హరీస్ రవూఫ్ 2, షహీన్ అఫ్రిది, మహ్మద్ సిరాజ్, షాదాద్ ఖాన్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 
 
ఆ తర్వాత 345 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు మరో 10 బంతులు మిగిలివుండగానే లక్ష్యాన్ని చేరుకుని విజయఢంకా మోగించింది. పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌లు సూపర్ సెంచరీలతో రాణించారు. షపీక్ 103 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 113 పరుగులు చేయగా, రిజ్వాన్ 121 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 131 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 
 
ఓ దశలో పాకిస్థాన్ జట్టు 37 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినా.. షఫీక్, రిజ్వాన్‌ల జోడీ మూడో వికెట్‌కు ఏకంగా 180 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయానికి బాటలు వేశారు. షఫీక్ ఔటైన్ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన షాద్ షకీల్ 31, ఆ తర్వాత మ్యాచ్ ఆఖరులో వచ్చిన ఇఫ్తికార్ అహ్మద్‌ సుడిగాలి ఇన్నింగ్ ఆడి 10 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 22 పరుగులు చేసి జట్టు గెలుపును మరింత సులభతరం చేశాడు. ఫలితంగా పాకిస్థాన్ ఆరు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Medical Student: ఒత్తిడిని తట్టుకోలేక పురుగుల మందు తాగి వైద్య విద్యార్థి ఆత్మహత్య

TTD: రూ.6 కోట్ల రూపాయల చెక్కును టీటీడీకి అందించిన చెన్నై భక్తుడు

చంద్రబాబుకు గవర్నర్‌ పదవి.. పవన్ సీఎం కాబోతున్నారా? నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం..?

Maha Kumba Mela: మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం.. ఎలా జరిగిందంటే?

గోమూత్రం తాగండి..జ్వరాన్ని తరిమికొట్టండి..వి. కామకోటి.. ఎవరాయన..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్టీఆర్ అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి.. భారతరత్నతో సత్కరించాలి

బాలీవుడ్‌కు బైబై చెప్పనున్న కీర్తి సురేష్... ఆ కొత్త ఛాన్స్ కలిసొస్తుందా?

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి.. నిందితుడు బిజోయ్ దాస్ విషయాలు.. ఎక్కడ నుంచి వచ్చాడంటే?

Bulli Raju: సంక్రాంతికి వస్తున్నాం.. బుల్లిరాజుకు పవన్ కల్యాణ్ ఇష్టమట...

సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి బంగ్లాదేశ్ జాతీయుడే..

తర్వాతి కథనం
Show comments